Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తన ఇంటిపేరు అయినటువంటి కొణిదెల గ్రామానికి పెద్ద ఎత్తున వరాలు కురిపించారు. నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు ప్రకటించడం గమనార్హం. కొణిదెల గ్రామ అభివృద్ధి దిశగా పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు.
ఈ క్రమంలోనే తన ఇంటిపేరుతో ఉన్నటువంటి ఈ గ్రామానికి 50 లక్షల రూపాయలను మంజూరు చేయడమే కాకుండా ఈ గ్రామ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఈ గ్రామానికి సరికొత్త గౌరవాన్ని తీసుకువచ్చారు. ఇక డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదపడుతున్నారు ఈ క్రమంలోనే పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయని తద్వారా రాష్ట్రం కూడా బాగుంటుందని భావిస్తున్నారు.
ఇలా పల్లెల అభివృద్ధి కోసం ఈయన ఎంతో కృషి చేస్తున్నారు. ఇక సినీ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కోసం దర్శక నిర్మాతలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈయన అడిగిన మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చి తనతో సినిమాలు చేయటానికి ఎదురు చూస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం తన పూర్తి దృష్టిని రాజకీయాలలో పెట్టారని తెలుస్తోంది.
జనసేన అధికారంలోకి రావడంతో ఏపీ అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఇక పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఏదైనా కూడా సాధ్యమవుతుందని ఆయన అనుకుంటే రాష్ట్రాన్ని తక్కువ సమయంలోనే అభివృద్ధి బాటలో నడిపిస్తారని చెప్పాలి. ఇప్పటికే జాతీయస్థాయి రాజకీయాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ సినిమాలపై కూడా కాస్త దృష్టి సారిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. సినిమాల పరంగా కూడా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకోవాలి అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఈయన మాత్రం తన దృష్టి రాజకీయాల వైపే ఉందని చెప్పకనే చెప్పేస్తున్నారు.