Pawan Kalyan: సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సూర్యదేవర నాగ వంశీ ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్ చేస్తున్నారు ఇక త్వరలోనే ఈయన బ్యానర్లో ప్రేక్షకుల ముందు మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా రాబోతోంది. ఈ క్రమంలోనే నాగ వంశీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఈయన పవన్ సినీ కెరియర్ గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు చేస్తారు అనడం కంటే కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన దేశానికి ఏం చేస్తారని ఆలోచించండి. ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదిగి,ప్రజలకు మంచి చేయాలని కోరుకోవాలి అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి నాగ వంశీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా రాజకీయ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈయన కమిట్ అయినా సినిమాలను కూడా పూర్తి చేయలేకపోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మూడు సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తికాగా మే నెలలో ఈ సినిమా విడుదల కానుంది. మిగిలిన రెండు చిత్రాలు దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నాయని తెలుస్తోంది.