Jagapathi Babu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సొంతం చేసుకుని ఫ్యామిలీ హీరోగా పేరు పొందారు. ఇలా ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలలో నటించిన జగపతిబాబు క్రమక్రమంగా అవకాశాలను కోల్పోయారు..
ఇలా ఈయనకు అవకాశాలు లేకపోవడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం ఈయన విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న జగపతిబాబు ప్రస్తుతం ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ క్షణం పాటు తీరిక లేకుండా ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇక సోషల్ మీడియా వేదికగా నిర్మహమాటంగా తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేయడంతో ఈయనని అభిమానించే వారి సంఖ్య కూడా భారీగానే ఉందని చెప్పాలి.
ఇదిలా ఉండగా తాజాగా జగపతిబాబు నటి ఆమని గురించి భారీ సెటైర్లు వేస్తూ ఒక వీడియో షేర్ చేశారు. వీరిద్దరూ తమ సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మరోసారి జంటగా కనిపించబోతున్నారని తెలుస్తోంది ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఆమనికి జగపతిబాబు మేకప్ వేయగా తిరిగి జగపతిబాబు ఆమనికి మేకప్ వేశారు.
ఇలా ఈ వీడియోని షేర్ చేసిన ఈయన మళ్లీ నన్ను మార్కెట్లో పెట్టి కోటి రూపాయలకు అమ్మేస్తావా ఏంటి అంటూ సెటైర్లు వేస్తూ ఈ వీడియోని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే జగపతిబాబు ఆమని హీరో హీరోయిన్లుగా నటించిన శుభలగ్నం సినిమాలో డబ్బు కోసం ఆమని తన భర్త అయిన జగపతిబాబుని మరొక హీరోయిన్ రోజాకు అమ్మేసిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.