Odela 2: తమన్నా భాటియా ‘ఓదెల 2’ ఏప్రిల్ 17న రిలీజ్

తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రతి అప్‌డేట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ అంచనాలని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది.

ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లలో ఒకటిగా ఏప్రిల్ 17న సినిమా ఓదెల2 థియేటర్స్ లో విడుదల కానుంది. హారర్, థ్రిల్లర్ చిత్రాలకు అన్ని వర్గాల ప్రేక్షకులలో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. నాగ సాధువుగా తమన్నా భాటియా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న ఓదెల 2 కథనం, సాంకేతిక అంశాల పరంగా ఇంతకు ముందు ఎప్పుడూ చూడని గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది.

రిలీజ్ డేట్ పోస్టర్ తమన్నాను ఊహించని లుక్‌లో ప్రజెంట్ చేసింది. ఆభరణాలతో సాంప్రదాయ దుస్తులలో ధరించి, ఆమె ఒక సాధారణ మహిళగా కనిపిస్తునే ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్, గాయం గుర్తులు క్యారెక్టర్ పై చాలా క్యురియాసిటీనీ పెంచాయి. వారణాసి నేపథ్యం మిస్టీరియస్ లేయర్ ని యాడ్ చేస్తున్నాయి. హెబా పటేల్, వశిష్ట ఎన్ సింహ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. థ్రిల్లింగ్ యాక్షన్‌ను కథలలో అద్భుతంగా బ్లెండ్ చేయడంలో పేరుతెచ్చుకున్న సంపత్ నంది ఓదెల 2ని పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రానికి కాంతర ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. సౌందరరాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ నిర్వర్తించగా, రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్. అద్భుతమైన టెక్నికల్ టీంతో ఓదెల 2 ఒక మరపురాని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.

ప్రెస్ మీట్ లో హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఓదెల సినిమాని డైరెక్టర్ అశోక్ గారు చాలా అద్భుతంగా తీశారు. ఆ సినిమా చూసినప్పుడే దానికి పార్ట్ 2 ఉండాలని భావించాను. సంపత్ నంది గారు పార్ట్-2 ఐడియా చెప్పినప్పుడు ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది ఈజీ జోనర్ కాదు. ఒక పల్లెటూరి కథని ఇంత ఎక్సైటింగ్ గా థ్రిల్లింగ్ గా చెప్పడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ అశోక్ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో తీశారు. నేను ఏ సినిమా చేసిన ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉండాలని కోరుకుంటాను. అలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ ని ఇచ్చే సినిమా ఇది. భైరవి క్యారెక్టర్ చేయడం యాక్టర్ గా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్ లో హైయెస్ట్ ఐషాట్ క్లోజప్స్ ఉన్న సినిమా ఇదే. భైరవి క్యారెక్టర్ ని బీలవబుల్, నేచురల్, మ్యాజికల్ గా చూపించడం నిజంగా బిగ్ ఛాలెంజ్. మధు గారు సినిమా ని చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఇది గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా. తప్పకుండా అందరికీ గ్రేట్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’అన్నారు

మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ.. ఈ సినిమా టీజర్ కి ఆర్గానిక్ గా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. దీనికి కారణం మీడియా, ప్రేక్షకులు, లార్డ్ శివ. ఈ సినిమా గురించి మంచి మాటలు రాసిన మీడియా వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓదెల సినిమా నాకు ఒక ఎమోషన్. నేను ఆ ఊర్లో పుట్టి పెరిగాను. చాలా గౌరవంగా ప్రేమతో ఈ సినిమాని రాసి తీయడం జరిగింది. ఊరిని కాపాడేది ఆ ఊర్లో ఉన్న ఇలవేల్పు దేవుడి గుడి. ఒక లైన్ లో చెప్పాలంటే.. ఓదెల విలేజ్ లో ఒక కష్టం వస్తే ఆ కష్టం పెద్దదైతే ఆ ఊరిలో ఉన్న ఓదెల మల్లన్న నాగ సాధు క్యారెక్టర్ ద్వారా ఎలా పరిష్కరించారనే అనేది కథ. కంటెంట్, స్క్రీన్ ప్లే, విజువల్ వండర్ గా ఉంటాయి. సౌందర్ రాజన్ చాలా అద్భుతమైనటువంటి విజువల్స్ ఇచ్చారు.

అజినీష్ అద్భుతమైన మ్యూజిక్ చేస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా. సినిమా ప్రేమించే ప్రేక్షకులు ఎక్కడున్నా ఈ సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భైరవి పాత్రలో తమన్నా గారు చాలా అద్భుతంగా నటించారు. ఈ పాత్ర తమన్నా కోసమే పుట్టింది. ఆమెను వెతుక్కుంటూనే వెళ్ళింది. 20 ఏళ్లుగా తమన్నా గొప్ప డెడికేషన్ తో యాక్టింగ్ చేస్తూ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇది మామూలు జర్నీ కాదు. నేను పదేళ్ల క్రితం ఏ డెడికేషన్ తనలో చూశానో ఇప్పుడు కూడా అదే డెడికేషన్ తనలో ఉంది. అందుకే ట్వంటీ ఇయర్స్ గా టాప్ చైర్ లో కూర్చుని ఉంది. తను లేడీ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది. తను మరో 20 ఏళ్లు మనందరినీ ఇలానే ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను’అన్నారు

యాక్టర్ పూజ మాట్లాడుతూ… ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన సంపత్ నందిగారికి అశోక్ తేజ గారికి థాంక్యూ సో మచ్. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. ఇందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. ఈ సినిమాని ఇంత గ్రాండ్ గా నిర్మించిన నిర్మాత మధు గారికి ధన్యవాదాలు. అందరికీ థాంక్యూ సో మచ్’అన్నారు

యాక్టర్ వశిష్ట సింహ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఓదెల సినిమాతో నాకు స్పెషల్ బాండింగ్ ఉంది. కరోనా తర్వాత అసలు మళ్లీ షూటింగులు జరుగుతాయా అనుకున్న సమయంలో సంపత్ నంది గారు ముందుకొచ్చి ఈ సినిమాని మొదలుపెట్టడం జరిగింది. ఒక మంచి ఉద్దేశంతో మొదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. నేను సంపత్ నందిగారికి పెద్ద అభిమానిని. ఆయన కథ చెప్పిన విధానం నాకు ఎంతగానో ఆకట్టుకుంది. ఓదెల సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. ఈ సినిమాలో తమన్నా గారితో కలిసి యాక్ట్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. తమన్న గారి డెడికేషన్ కి హ్యాట్సాఫ్. ఇలాంటి సినిమాలు ప్రతి ఆర్టిస్ట్ కి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వరకు 40 సినిమాలు చేశాను కానీ ఇందులో నేను ఎప్పుడూ చేయని ఒక పాత్రని ఇచ్చారు. ఆ క్యారెక్టర్ ఆలోచనకి ఆశ్చర్యపోయాను, అద్భుతంగా వచ్చింది. మీరు తెరపై చూడాల్సిందే. మీ అందరి సపోర్టు కావాలి’అన్నారు

నిర్మాత డి మధు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం . మహా కుంభమేళాలో రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కి చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది . చాలా ఆర్గానిక్ గా ఒక విలేజ్ లో జరిగే స్టొరీ ఇది. కంటెంట్ ని నమ్ముకుని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా చేయడం జరిగింది. ప్రతి ఆర్టిస్టు మాకు ఎంతగానో సపోర్ట్ చేసి షూటింగ్ చేశారు. తమన్నా గారు వచ్చిన తర్వాత బడ్జెట్ గురించి ఇంక ఆలోచించలేదు. తమన్నా గారు ఈ సినిమా కోసం కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అయ్యారు. డిఓపి చాలా అద్భుతమైనటువంటి విజువల్స్ ఇచ్చారు. అజనీష్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యూజిక్ అదిరిపోయింది. సంపత్ నందిగారి సూపర్ విజన్, డైరెక్టర్ అశోక్ గారి దర్శకత్వం సినిమాని అద్భుతంగా మలిచి ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసి ప్రేక్షకులు గొప్పగా ఆస్వాదిస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నాను

డైరెక్టర్ అశోక్ తేజ మాట్లాడుతూ.. ఆకలిగా ఉందని అన్నం కోసం సంపత్ నంది గారి దగ్గరికి వెళ్లాను ఆయన నాకు బిర్యాని తినిపించారు. థాంక్యూ సో మచ్ సంపత్ గారు. తమన్నా గారు ఎంతో గొప్పగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఈ సినిమాని చేశారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు

యాక్టర్ నాగమహేష్ మాట్లాడుతూ.. ఓదెల సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఓదెల 2 దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించబోతుంది. ఇందులో ఇన్స్పెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాను. తన ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇస్తున్న సంపత్ నందిగారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయం సాధిస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను

యాక్టర్ గగన్ మాట్లాడుతూ… కోవిడ్ సమయంలో చేసిన ఓదెల చాలా పెద్ద హిట్ అయింది. అందరూ ఆ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకున్నారు. సంపత్ నంది గారి విజన్ వల్లే అది సాధ్యపడింది. ఓదెల 2 పోస్టర్ లో తమన్నా గారిని చూసినప్పుడు మళ్లీ హిట్ కొట్టేసాం అని నమ్మకం వచ్చింది. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఒక ఎక్సైట్మెంటు వస్తుంది. పుష్ప 2 సినిమా షూటింగ్ ల కూడా అలానే అనిపించింది. కచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించబోతుంది. కచ్చితంగా ఈ సినిమా గొప్ప మ్యాజిక్ చేయబోతుంది. సంపత్ నంది గారు ఇలానే అందర్నీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అశోక్ తేజ డైరెక్షన్లో చేయడం చాలా ఆనందంగా ఉంది నిర్మాత మధుగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. తమన్నా గారి డెడికేషన్ కి హ్యాట్సాఫ్. తమన్నా గారు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద హిట్ కాబోతుంది’అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.

తారాగణం: తమన్నా భాటియా, హెబా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి

సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: డి మధు
క్రియేటర్: సంపత్ నంది
బ్యానర్లు: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్
దర్శకత్వం: అశోక్ తేజ
డిఓపీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో