KCR: ఏపీలో కూటమి అనేది లేకపోతే జగనే ముఖ్యమంత్రి…. కేసీఆర్ కామెంట్స్ వైరల్!

KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తాజాగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ కార్యకర్తలతో నేతలతో సమావేశం అయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన బి ఆర్ ఎస్ పార్టీ వచ్చే ఎన్నికలలో పొత్తు పెట్టుకోవడం గురించి అలాగే ఏపీ రాష్ట్ర రాజకీయాల గురించి కూడా ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

బిఆర్ఎస్ వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని వార్తలు తెగ చెక్కరలు కొట్టాయి ఇలాంటి తరుణంలో కేసీఆర్ స్పందిస్తూ అలాంటిది ఉండదని తాము సింగిల్గానే పోటీ చేస్తామని చెప్పకనే చెప్పేశారు. ఇక ఏపీ రాష్ట్ర రాజకీయాల గురించి కూడా ఈయన మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాయి. ఇలా పొత్తు పెట్టుకోవడం వల్లే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు లేకపోతే ఏపీలో తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారు అంటూ కేసిఆర్ తెలియజేశారు. ఇలా పొత్తు లేకపోతే జగనే ముఖ్యమంత్రి అయ్యేవారు అంటూ కేసిఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇకపోతే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. ఇక గత ఐదు సంవత్సరాల కాలంలో ఏపీలో జగన్ అధికారంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కూడా ప్రతిపక్షంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీల నాయకులు కూడా పొత్తు లేకుండా సింగిల్ గా పోటీ చేసి గతంలో విజయం సాధించారు.