ఇన్సైడ్ టాక్ : “ఆదిపురుష్” లో ఆ భారీ మార్పులు చేస్తున్నారా?

తాజాగా పాన్ ఇండియా మార్కెట్ లో సంచలనంగా మారిన చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన అవైటెడ్ మరో చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం టీజర్ తర్వాత మాత్రం ఒక్కసారిగా పరిస్థితి మారింది. దర్శకుడు ఓంరౌత్ పని తీరుపై చాలానే విమర్శలు వచ్చాయి.

తర్వాత 3డి టీజర్ అంటూ చాలానే హంగామా చేశారు కానీ లాస్ట్ కి ఎలా ఏదన్నా మొదటికే మోసం వస్తుంది అని గ్రాఫిక్స్ పరంగా వర్క్ ఉందని విడుదల వాయిదా వేసేసారు. దీనితో ఈ అవైటెడ్ సినిమా ఫైనల్ గా ఆగింది. ఇక ఇప్పుడు ఈ సినిమా వర్క్ ప్రోగ్రెస్ లో భారీ మార్పులు ఉంటాయని సినీ వర్గాల్లో లేటెస్ట్ ఇన్సైడ్ టాక్.

దీనితో లేటెస్ట్ గా ఓ ఊహించని టాక్ బయటకి వచ్చింది. రావణ పాత్రకి సంబంధించి ఇప్పుడు చాలా మార్పులే చేయబోతున్నారట. మరి నటుడు సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్న ఈ పాత్ర వేషధారణలో ఇప్పుడు మార్పులు కనిపిస్తాయట. వి ఎఫ్ ఎక్స్ లో తన లుక్ పరంగా చాలా మార్పులు చేస్తున్నారట.

మరి ఈసారి చేసే ఛేంజెస్ ఏమన్నా బెటర్ గా ఉంటాయో లేదో వేచి చూడాల్సిందే. ఇంకా ఈ సినిమాలో కృతి సనన్ జానకి దేవి పాత్రలో నటిస్తుండగా ఓంరౌత్ భూషణ్ కుమార్ లు నిర్మాణం వహించారు.