అతను నా జీవితంలోకి రావడం నా అదృష్టం.. పెళ్లి, భర్త గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చిన కీర్తి సురేష్!

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తర్వాత మహానటి సినిమాతో జాతీయ నటిగా మారిపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ హోదాని ఎంజాయ్ చేస్తున్న ఈ నటి ఈ మధ్యనే వైవాహిక బంధం లోకి అడుగు పెట్టింది. కీర్తిసురేష్, ఆంటోనీ తట్టిల్ ల పెళ్లి గోవాలో ఎంతో గ్రాండ్ గా జరిగింది. డిసెంబరు 12న వీరి పెళ్లి జరిగింది. ఆంటోనీ తట్టిల్, కీర్తిసురేష్ ల పెళ్లి హిందు, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం చేసుకున్నారు.కీర్తిసురేష్ తాజాగా ఇంటర్వ్యూలో తన ప్రేమ, భర్త గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఆంటోనీ తట్టిల్, కీర్తి సురేష్ ల మధ్య 15 ఏళ్ల పాటు ప్రేమ సాగినట్లు చెప్పుకొచ్చింది. 12వ తరగతిలో ఉన్నప్పుడే అతనితో ప్రేమలో పడినట్లు చెప్పింది. 2010లో మొదటిసారిగా తనకి ఆంటోనీ ప్రపోజ్ చేశాడని కానీ 2016 నుంచే తమ బంధం మరింత బలపడిందని చెప్పింది. నాకు ప్రామిస్ రింగ్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. అది మీరు సినిమాలలో కూడా చూడవచ్చు. నా పెళ్లి ఒక కల లాగా అనిపిస్తుంది నా హృదయం భావోద్వేగంతో నిండిపోయింది.

వివాహం కోసం మేము ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ సందర్భం రాలేదు ఆంటోనీ నాకంటే ఏడేళ్లు పెద్ద. అతను భర్తగా నా జీవితంలోకి రావడం నా అదృష్టం.ఆరు సంవత్సరాల నుంచి ఆంటోనీ ఖతార్ లో వర్క్ చేస్తున్నాడు నా కెరియర్ కి మంచి సపోర్ట్ ఇస్తాడు. మేమిద్దరం వ్యక్తిగత విషయాలని గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతాము మా మధ్య ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నప్పటికీ మొదటిసారిగా 2017 లో మాత్రమే కలిసి విదేశాలకు వెళ్ళాము.

పెళ్ళి వరకు మా ప్రేమ విషయం గోప్యంగా ఉంచాలనుకున్నాము అందుకే ప్రేమ విషయం ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పెళ్లి అయిన దగ్గర్నుంచి నేను పసుపు దాడితోనే ప్రమోషన్స్ లో పాల్గొన్నాను, పసుపు తాడు ఎంతో శక్తివంతమైనది మంచి ముహూర్తం చూసుకొని మంగళ సూత్రాలని బంగారు గొలుసులోకి మార్చుకుంటాను అంట ప్రేమతో మొదలుపెట్టి పెళ్లి వరకు జరిగిన అన్ని సంఘటనలని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.