Prabhas: న్యూ ఇయర్ వేళ సినీ నటుడు ప్రభాస్ ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో డ్రగ్స్‌తో కలిగే అనర్థాలను వివరించారు. లైఫ్‌లో మనకు బోలెడన్ని ఆనందాలు ఉన్నాయని.. జీవితంలో కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉందని ప్రభాస్ తెలిపారు.
మనల్ని ప్రేమించే, మన కోసం బతికేవాళ్లు ఉన్నప్పుడు.. జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అని ప్రశ్నించారు. మాదక ద్రవ్యాలకు నో చెప్పాలని పిలుపునిచ్చారు. మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలు అయితే టోల్‌ఫ్రీ నంబర్ 8712671111కు కాల్ చేయాలని సూచించారు. డ్రగ్స్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. బాధితులు కోలుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు.