తెలంగాణ రైతులకు అదిరిపోయే తీపికబురు ఇదే.. నగదు జమ ఎప్పుడంటే?

తెలంగాణ రైతులకు ప్రయోజనం చేకూరేలా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ సర్కార్ రైతు భరోసా పంపిణీ గురించి అధికారిక అప్ డేట్ ఇవ్వగా ఆ అప్ డేట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఈ సమావేశంలో మంత్రివర్గ సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకోగా ఆ నిర్ణయాలు వైరల్ అవుతున్నాయి. రైతు భరోసా విధి విధానాలకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.

పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా కోసం రైతుల నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జనవరి 5 తేదీ నుంచి 7 తేదీ వరకు దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకోగా అధికారికంగా ఇందుకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. జనవరి 14వ తేదీన సంక్రాంతి పర్వదినం సందర్భంగా.. రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం నిధులు జమ చేయాలని తెలంగాణ సర్కార్ ఫీలవుతోంది.

తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. అసలైన రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా తెలంగాణ సర్కార్ వ్యవహరించడం హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణ సర్కార్ రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందని సమాచారం అందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్ద పీట వేస్తుండటం గమనార్హం.