Khushbu Sundar: మందుకు బానిస అయ్యి ఆ హీరో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు.. ఖుష్బూ కామెంట్స్ వైరల్!

Khushbu Sundar: ఖుష్బూ.. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె మాట్లాడిన ఆడియోకు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ విషయంపై ఆమె స్పందించడం ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా వరుసగా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది ఖుష్బూ. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ ఇంటర్వ్యూలో అనేక అంశాల గురించి స్పందించారు. అందులో భాగంగానే ఒక హీరో మందుకు బానిస అవడం గురించి స్పందించారు. ఈ మేరకు ఇంటర్వ్యూలో భాగంగా ఖుష్బూ మాట్లాడుతూ.. కాగా ఖుష్బూకి ఉన్న స్నేహితులలో రాజీవ్ కపూర్ కూడా ఒకరు.

ఈయన కేవలం హీరో మాత్రమే కాదు దర్శకుడు నిర్మాత కూడా. తండ్రి రాజ్ కపూర్ 1985లో చివరిసారి దర్శకత్వం వహించిన రామ్ తేరీ గంగ మైలీ సినిమాలో రాజీవ్ కపూర్ చివరిగా నటించాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌ గా ఖుష్బూ నటించాల్సింది. తనతో ఫోటోషూట్‌ కూడా చేశారు. కానీ చివరకు ఆమెను ఎంపిక చేయలేదు. దాని గురించి ఖుష్బూ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజ్‌కపూర్‌ మొదట నన్నే గంగ పాత్రలో ఊహించుకున్నారు. అ‍ప్పుడు నా వయసు పద్నాలుగేళ్లు. నేనే చిన్నపిల్లలా ఉన్నాను. అలాంటిది ఓకే పాపను ఎత్తుకుని యాక్ట్‌ చేస్తే బాగోదని వద్దన్నారు అని చెప్పుకొచ్చింది. రాజీవ్‌ కపూర్‌ గురించి మాట్లాడుతూ.. తనకు హృదయ సమస్య ఉంది.

అయినా పట్టించుకోకుండా ఎప్పుడూ మందు తాగుతూ ఉండేవాడు. ఇది ఏదో ఒక రోజు పెద్ద సమస్యకు దారి తీస్తుందని మేము భయపడ్డాము. తనతో ఎలాగైనా మద్యపానం మాన్పించాలని ప్రయత్నించాము. కానీ మా వల్ల కాలేదు. తర్వాత చాలా డల్‌ అయిపోయాడు. ఆయన మోకాలికి ఏదో సమస్య వచ్చినప్పుడు పలు సర్జరీలు చేశారు. కానీ నయం కాలేదు. చింపు ఆరోగ్యం క్షీణిస్తోందని మాకు తెలుసు. తను చనిపోయినప్పుడు నేను ముంబైలో ఉన్నాను. బోనీ కపూర్‌ ఫోన్‌ చేసి విషయం చెప్పగానే షాక్ అయ్యాను. తను చనిపోవడానికి ముందు రోజే మాట్లాడాను. విపరీతమైన జ్వరం ఉంది. అయినా తన అలవాట్లు మార్చుకోలేదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. త్వరలోనే కలుస్తానని మాట ఇచ్చాడు. అంతలోనే ఈ విషాదం జరిగింది అని ఖుష్బూ చెప్పుకొచ్చింది. కాగా రాజీవ్‌ కపూర్‌ 2021 ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఖుష్బూ సుందర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.