Pinaka: గోల్డెన్ స్టార్ గణేష్ స్టన్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్: ‘పినాక’ టైటిల్ టీజర్ రిలీజ్

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న గోల్డెన్ స్టార్ గణేష్ అప్ కమింగ్ మూవీ ‘పినాక’ టీజర్ విడుదలైయింది. టీజర్ అభిమానులను, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విజువల్ ట్రీట్‌ను అందించింది. గోల్డెన్ స్టార్ గణేష్ క్షుద్ర, రుద్రగా స్టన్నింగ్ న్యూ అవాతర్ లో తన వెర్సటాలిటీ చూపించారు. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బి. ధనంజయ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మైల్ స్టోన్ 49వ ప్రాజెక్ట్ (PMF49)గా వస్తున్న ‘పినాక’ కన్నడ సినిమాని రీడిఫైన్ చేయనుంది.

కన్నడ సినిమాలో మునుపెన్నడూ లేనివిధంగా గ్రిప్పింగ్ స్టోరీలైన్, అద్భుతమైన విజువల్స్, బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్స్ తో కూడిన గ్రాండ్ పీరియాడిక్ డ్రామాని టీజర్ పరిచయం చేసింది. బ్రెత్ టేకింగ్ వీఎఫ్ఎక్స్, అడ్వాన్స్ విజువల్స్‌తో ‘పినాక’ న్యూ ఎక్సయిటింగ్ వరల్డ్ ని ప్రజెంట్ చేసింది. రాంపేజ్ ఆఫ్ క్షుద్ర పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, హై క్యాలిటీ స్టొరీ టెల్లింగ్, వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ ద్వారా కన్నడ సినిమాను నెక్స్ట్ లెవల్ కి చేర్చాలనే విజన్ కి ఈ ప్రాజెక్ట్ నిదర్శనంగా ఉండబోతోంది.

ఈమూవీ గోల్డెన్ స్టార్ గణేష్ కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తోంది, ఛాలెంజింగ్ రోల్స్ చేయడంలో అతని వెర్సటాలిటీని ప్రజెంట్ చేస్తోంది. మరిచిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తూ టీజర్ గ్రేట్ ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేసింది.

ఈ ప్రాజెక్ట్స్ కి సంబధించిన మరిన్ని అప్‌డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.