Game Changer Trailer: తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసిన నటించిన చిత్రం గేమ్ చేంజర్. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుక జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు. విడుదల తేదీకి మరి కొద్ది రోజులే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా ట్రైలర్ ను జనవరి నాలుగున అలా విడుదల చేస్తామని మొదటి నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ తాజాగా అభిమానులను ఆశ్చర్యపడుతూ గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ విడుదల చేసేసారు మూవీ మేకర్స్. అయితే ఈ ట్రైలర్ ని చూస్తుంటే ఒక సీఎం కి అలాగే ఐఏఎస్ ఆఫీసర్ కి మధ్య జరిగే పోరాటం అని తెలుస్తోంది. ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉంది. కడుపు నిండా వంద ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే.. పెద్దగా దానికి వచ్చే నష్టమేమి లేదు. కానీ ఆ ముద్ద లక్ష చీమలకు ఆహారం. నేను మీ దగ్గర కూడా అడిగేది ఆ ఒక్క ముద్ద మాత్రమే.
మా పార్టీ సేవ చేయడానికే కానీ.. సంపాదించడానికి కాదు. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి చూడొద్దు మామ ఒప్పుకో అనే డైలాగ్స్ చాలా బాగున్నాయి. కొన్ని షాట్స్ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో అనిపిస్తున్నాయి. మొత్తానికి ట్రైలర్‌తో సినిమాపై అంచానాలు మాత్రం తారా స్థాయికి వెళ్లాయి. ఈ టైలర్ పై మెగా అభిమానులు చెర్రీ అభిమానులు స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నిజంగా గూస్ బంప్స్ వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు అంజలి, కియారా అద్వానీ, SJ సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, విశ్వంత్.. పలువురు స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.