Prabhas: మనకోసం బతికే వాళ్ళు ఉన్నారు.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ :ప్రభాస్

Prabhas: మరి కొన్ని గంటలలో 2024 కు ఎండ్ కార్డు పడబోతుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు అయితే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలోనే చాలామంది మద్యం డ్రగ్స్ వంటివి సేవిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు అందుకే పోలీసులు సెలబ్రిటీలు ఈ విషయంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూ వీడియోలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సైతం డ్రగ్స్ గురించి అభిమానులకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మన లైఫ్ లో మనకు ఎన్నో బోలెడన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. కావలసినంత వినోదం ఉంది మనల్ని ప్రేమించే మనుషులు మన కోసం బ్రతికే వాళ్ళు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్?ఈరోజు నుండి డ్రగ్స్ కి గుడ్ బై చెప్పండి.. మీకు తెలిసిన వారెవరైనా డ్రగ్స్ కి బానిసలైతే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వగలరంటూ ప్రభాస్ తెలిపారు.

ఈ విధంగా ప్రభాస్ అభిమానులను అలాగే ప్రేక్షకులను సైతం ఎప్పుడు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు అలాంటిది ఈయన ఎంతో ప్రేమగా డ్రగ్స్ తీసుకోవద్దండి జీవితంలో ప్రతి ఒక్క మూమెంట్ కూడా ఎంజాయ్ చేస్తూ గడపండి అంటూ అవగాహన కల్పిస్తూ చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హీరోలందరూ కూడా ఇలాంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కండిషన్లు పెట్టిన సంగతి తెలిసిందే .ప్రతి ఒక్క హీరో సినిమా విడుదల చేయడానికి ముందు ఇలాంటి ఒక చిన్న వీడియోని విడుదల చేసి డ్రగ్స్ గురించి అందరికీ అవగాహన కల్పించాలని చెప్పారు. దీంతో హీరోలు అందరూ కూడా ఏకమవుతూ డ్రగ్స్ గురించి అందరికీ అవగాహన కల్పిస్తున్నారు.