కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. యూపీలోని నోయిడాకు సంబంధించిన ఈ కంపెనీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏపీలోని 26 జిల్లాలలో 255 కెరీర్, మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సైకాలజీలో ఎంఎస్సీ, ఎం.ఏ బ్యాచిలర్ డిగ్రీ, కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ లో డిప్లొమా కలిగి ఉండాలి. కనీసం రెండున్నర సంవత్సరాల కౌన్సిలింగ్ అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2024 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ నాటికి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 30 వేల రూపాయల వేతనం లభించనుందని తెలుస్తోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి రుసుము అవసరం లేదు.
తెలుగు భాషలో ప్రావీణ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అర్హత, ఉద్యోగ అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఒకింత ఎక్కువగానే ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అర్హత, అనుభవం ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.