డార్క్ సర్కిల్స్ కు చెక్ పెట్టే సూపర్ చిట్కాలివే.. ఈ చిట్కాలతో సమస్యకు పూర్తిగా చెక్!

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎక్కువమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో డార్క్ సర్కిల్స్ కూడా ఒకటి. కళ్ల కింద నల్లటి వలయాలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా డార్క్ సర్కిల్స్ కు పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చు. కాటన్ ను పాలలో నానబెట్టి కళ్ల కింద 10 నిమిషాల పాటు ఉంచడం ద్వారా డార్క్ సర్కిల్స్ దూరమవుతాయి.

బంగాళదుంప రసాన్ని అప్లై చేయడం ద్వారా కూడా డార్క్ సర్కిల్స్ దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. అలోవేరా జెల్ తో డార్క్ సర్కిల్స్ పై మసాజ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. టమాటా రసంలో నిమ్మరసం వేసి డార్క్ సర్కిల్స్ పై అప్లై చేయడం ద్వారా కూడా సమస్య దూరమయే ఛాన్స్ ఉంటుంది. బాదం నూనె, విటమిన్ ఇ క్యాప్సూల్స్ తో కళ్ల కింద మసాజ్ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.

అయితే ఈ చిట్కాలు పాటించినా సమస్య తగ్గకపోతే మాత్రం వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి. ఏవైనా అలర్జీలు ఉన్నవాళ్లు మాత్రం అలర్జీ ఉన్న పదార్థాలను కంటి కింద అప్లై చేయడం మంచిది కాదని చెప్పవచ్చు. ఈ చిట్కాలను కొన్ని రోజుల పాటు పాటించడం ద్వారా డార్క్ సర్కిల్స్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది.

నిద్రకు ఉపక్రమించే 40 నిమిషాల ముందు అండర్ ఐ క్రీమ్ రాసుకోండి. గ్రీన్ టీ బ్యాగులు నల్లటి వలయాలను తగ్గించే రక్త నాళాలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. సక్రమంగా నిద్రపోవడం వల్ల నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు. డిజిటల్ పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు తరచుగా విరామం తీసుకోండి. స్క్రీన్ గ్లేర్‌ను తగ్గించడానికి ఓవర్‌హెడ్ లైటింగ్‌ను తగ్గించండి.