Rajamouli–Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేజర్ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు మూవీ మేకర్స్. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లోనే ఏఎంబి మాల్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ శంకర్,అంజలి, సూర్య, శ్రీకాంత్, సముద్రఖని,దిల్ రాజు తో పాటుగా స్పెషల్ గెస్ట్ గా రాజమౌళి సైతం హాజరయ్యారు.
అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సమయంలో జక్కన్న స్టేజి మీద మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ.. నేను ఏ హీరోని ఒరిజినల్ పేర్లతో పిలవను. ఒక్కో హీరోని ఒక్కో పేరుతో పిలుస్తాను. రామ్ చరణ్ ని నేను హీరో అని పిలుస్తాను. మగధీర సమయంలో హీరో హీరో అనే పిలిచేవాడిని. చరణ్ అనడం కంటే కూడా నాకు రామ్ అని పిలవడం ఇష్టం. అలాగే.. నువ్వు గుర్రం మీద సీన్స్ తీస్తే నా పర్మిషన్ తీసుకొని చెయ్యి. ఆ షాట్స్ నావి, నువ్వు ఎవరికీ చేయడానికి లేదు.
ఆ షాట్స్ రైట్స్ నావి. ఇప్పుడే రైట్స్ నాకు పేపర్ మీద రాసిచ్చేయి అని సరదాగా నవ్వుతూ వార్నింగ్ ఇచ్చారు. ఇక రాజమౌళి చెప్పిన దానికి కూడా చరణ్ ఓకే అన్నట్టుగా నవ్వుతూ తల ఊపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే.. దాదాపుగా 300 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జనవరి 10న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.