పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి వైబ్రేషన్, అగ్రెషన్, ఇన్‌స్పిరేషన్.. ఇలా చాలా ఉన్నాయంటారు పవన్ ఫ్యాన్స్. అసలు పవన్ కి అభిమానులు కాదు భక్తులు ఉంటారంటారు టాలీవుడ్ జనాలు. పవన్ సినిమా వస్తే థియేటర్స్ వద్ద పండగే. పవన్ అభిమానులు తమ హీరో సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే పవన్ గతంలో ఒప్పుకున్న ఓజీ,హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పూర్తి చేసిన తర్వాత మళ్లీ సినిమాలలో నటించను అంటూ పదే పదే చెప్పటంతో ప్రేక్షకులతో పాటు నిర్మాతలు కూడా తీవ్ర నిరాశకి గురవుతున్నారు.
పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలనుకునేవాళ్లు ప్రత్యామ్నాయం వెతుక్కోవడం మంచిది , పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకునేవాళ్లు ఆ అవకాశం రాదని మెంటల్ గా ప్రిపేర్ అయిపోడం బెటర్, ఇక పవన్ డైలాగ్స్ చెబితే చూడాలని, ఆ పవర్ పంచ్ లను ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేస్కోవాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఇక ఆ ఛాన్స్ పెద్దగా ఉండదని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
గతంలో రాజకీయాల్లోకి వచ్చే ముందు సినిమాలు మానేస్తానని ప్రకటించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ పార్టీని నడపడానికి డబ్బులు కావాలని మళ్ళీ సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు పవన్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టడంతో పవన్ దాదాపు సినిమాలకు గుడ్ బై చెప్పినట్టే అన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.
ఇప్పుడు పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా, జనసేన పార్టీ అధ్యక్షుడు గా ఇక ఫుల్ టైమ్ పాలిటిక్స్‌లోనే బిజీగా ఉండనున్నారు పవన్. సో డైరెక్టర్లు చెప్పే స్టోరీలు వినే టైమ్ కూడా సేనానికి ఉండకపోవచ్చంటున్నారు. పార్టీని బలోపేతం చేస్తూ పాలిటిక్స్ లో తనదైన మార్క్ చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక పవన్ సినిమాలు చేస్తారా అన్నది మాత్రం డౌటే అన్న మాటే ఎక్కువగా టాలీవుడ్ లో వినిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో మరి.