Anasuya: జబర్దస్త్ యాంకర్ గా ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకుంది అనసూయ భరద్వాజ్. యాంకర్ గానే కాదు నటిగా కూడా తనకు మంచి మార్కులు పడుతున్నాయి. అనసూయ నటించిన రంగస్థలం సినిమాలో తను పోషించిన రంగమ్మత్త క్యారెక్టర్ కు నటనలో మంచి మార్కులే పడ్డాయి. ఇటీవల వచ్చిన పుష్ప,కిలాడి సినిమాలలో కూడా నటించింది.ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పుడూ ఫోటోషూట్స్.. సినిమా అప్డేట్స్.. ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్ లో హల్ చల్ చేస్తోంది. అప్డేట్ షేర్ చేస్తూ ఉండటమే కాదు అనసూయకు ట్రోల్స్ కూడా కొత్తేమి కాదు.
ఇటీవల ఉమెన్స్ డే రోజున నెట్టింట్లో అనసూయ చేసిన రచ్చ గురించి తెలిసిందే.నెటిజన్స్ చేసే కామెంట్లకు ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో గట్టిగానే సమాధానాలు చెబుతుంటుంది.అనసూయ ఇటీవల రవితేజ నటించిన ఖిలాడి సినిమాతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అనసూయ పేపర్ బాయ్ సినిమా ను దర్శకత్వం వహించిన జయశంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాని ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు.అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోసాయికుమార్, వైవా హర్ష, అక్ష పర్థసాని, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర బృందం మాట్లాడుతూ 80 శాతం సినిమా షూటింగ్ పూర్తి అయిందని మిగిలిన భాగాన్ని ఏప్రిల్లోపు పూర్తి చేస్తామని చెప్పారు. నిర్మాత శేషు మారంరెడ్డి మాట్లాడుతూ.. శ్రీనివాస్ రెడ్డి చమ్మక్ చంద్ర మధ్య జరిగే సన్నివేశాలు చాలాబాగా వచ్చాయని ప్రేక్షకులు వాటిని బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు.
ఇక దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి ‘గ్రహమ్’అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం చాలా ప్లస్ అవుతుందని తెలియజేశారు. ఈ సినిమా తో అనసూయ ఎలా అలరిస్తుందో చూడాలి. అంతే కాదు అనసూయ చేతిలో పలు సినిమాలు ఉన్నట్లు సమాచారం.