కమెడియన్ నుంచి డైరెక్టర్ గా మారిన అభినయ కృష్ణ.. అయితే సినిమాకి కాదు వెబ్ సిరీస్ కి!

ప్రముఖ బుల్లితెర ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాదు.. ఎంతోమంది కళాకారులను గుర్తించింది. ఈ షో ఫేమ్ తో కొంతమంది నటులు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. అందులో కొందరు స్టార్ కమెడియన్స్ గా రాణిస్తే.. మరికొందరు హీరోలుగా, డైరెక్టర్లుగా మారారు. మరి కొందరు ప్రొడ్యూసర్లుగా మారి సినిమాలు కూడా తీస్తున్న విషయం తెలిసిందే.

అలాగే తాజాగా జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి దీపావళి పండగ నాడు తాను డైరెక్టర్ గా మారుతున్ననంటూ.. పోస్టర్ రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమా పేరును కూడా ఖరారు చేశారు అదిరే అభి. అభి తన డెబ్యూ మూవీకి ‘చిరంజీవ’ పేరు పెట్టారు. ఈ మైథలాజికల్ కంటెంట్ లో యంగ్ హీరో రాజ్ త‌రుణ్ హీరోగా నటించబోతున్నారు. అయితే… ఇది సినిమాగా కాకుండా.. ఓటీటీలో మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీలో రాబోతుంది. ఇక ఈ మధ్యనే ఒక వీడియో రిలీజ్ అయింది వీడియోలో డైరెక్టర్ అభినయ కృష్ణ టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తో కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. దీనిని బట్టి ఇదొక సూపర్ హీరో కథ అని..పక్కా ఇండియన్ స్టైల్ లో ఈ కథ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించని కాన్సెప్ట్ తో ఇది ఉంటుందని తెలిపాడు.

త్వరలోనే ఈ సీరీస్ కు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేస్తానని చెప్పాడు అభినయ కృష్ణ.ఈ వెబ్ సిరీస్ ను ఎ రాహుల్ యాదవ్ , సుహాసిని రాహుల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అచ్చు రాజ‌మ‌ణి సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ చిరంజీవ వెబ్ సిరీస్ నుంచి మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు జబర్దస్త్ షోలో స్టార్ కమెడియన్ గా అలరించిన అదిరే అభి.. డైరెక్టర్ గా మారడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.