వై వి ఎస్ చౌదరిని కలిసిన జానీ మాస్టర్.. కలయిక వెనుక కారణమేమిటో?

ఈ మధ్యనే లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలుకు వెళ్లిన జానీ మాస్టర్ ప్రస్తుతం బయలు మీద ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు కారణంగా అతనికి రావలసిన జాతీయ అవార్డు దూరమైంది పుష్పటు సినిమాతో పాటు పలు సినిమా ఛాన్స్ లో చేజారిపోయాయి ప్రస్తుతం మళ్ళీ తన ప్రొఫెషన్ లో బిజీ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు జానీ మాస్టర్ త్వరలోనే మంచి అప్డేట్ ఇస్తానంటూ రీసెంట్గా రీల్ చేసి ఏదో పెద్ద ప్లానే చేస్తున్నాడు అనిపించేలా చేశాడు.

ఇప్పటికే రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ లో తను కొరియోగ్రఫీ చేసిన డాన్స్ గురించి ఇప్పటికే చాలా ఎలివేషన్ ఇచ్చాడు జానీ మాస్టర్. ఈ పాట నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని, ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరు చేయలేదని, ఇదొక కొత్త ప్రయోగమని చెప్పుకొచ్చారు. అలాగే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ సినిమాలో స్పెషల్ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు సమాచారం.

అయితే జానీ మాస్టర్ తాజాగా డైరెక్టర్ వై వి ఎస్ చౌదరితో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నందమూరి జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు తో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ వైవిఎస్ చౌదరిని కలవటం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ సినిమాలో కొరియోగ్రఫీ జానీ మాస్టర్ చేయబోతున్నాడా అనే చర్చ జరుగుతోంది.

పైగా వైవిఎస్ చౌదరితో కలిసి తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా రోజుల తర్వాత జెమ్ లాంటి పర్సన్ వైవిఎస్ చౌదరి గారిని కలిసాను,కెరియర్ ప్రారంభంలో ఆయన ఇచ్చిన సపోర్ట్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆయన మాటలు నాకు మళ్ళీ అపారమైన శక్తిని ఇచ్చాయి. అయినా తీస్తున్న మూవీ సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాసుకొచ్చారు జానీ మాస్టర్.