మెహందీ ఫోటోలతో సోషల్ మీడియాలో యాంకర్ రష్మీ రచ్చ.. షాక్ లో నెటిజన్స్!

యాంకర్ రష్మీ గౌతమ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా ఆమె ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ షోలో యాంకరింగ్ చేయడానికన్నా ముందే ఆమె కొన్ని సినిమాలలో నటించింది . దివంగత నటుడు ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ సినిమా ఆమె ఫస్ట్ మూవీ. ఈ సినిమాలో ఆమె కమెడియన్ సునీల్ కి ప్రియురాలు గా నటించింది. ఆ తర్వాత కరెంట్,బిందాస్, గుంటూరు టాకీస్, బోళా శంకర్, హాస్టల్ బాయ్స్ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో నటించింది.

అయినా అనుకున్నంత గుర్తింపు సాధించలేకపోయింది. జబర్దస్త్ షో ద్వారా అంతకుమించిన పాపులారిటీని సంపాదించుకుంది. జబర్దస్త్ స్టార్ యాంకర్ సుడిగాలి సుదీర్ తో ఈమె చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని కొన్నిసార్లు, ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని కొన్నిసార్లు ఇలా నిత్యం ఈ జంట సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు.

వీళ్ళకి చాలాసార్లు టీవీ షోలలో పెళ్లి జరిగింది కానీ నిజజీవితంలో మాత్రం అది రూమర్ గానే మిగిలిపోయింది. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో మెహందీ వేడుకలలో చేతి నిండా గోరింటాకు పెట్టుకుని ఫ్యామిలీ ఫొటోస్ ని అప్లోడ్ చేసింది రష్మీ. ఆ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.రష్మీ పెళ్లి చేసుకుంటుందా అంటూ కన్ఫ్యూజ్ అయ్యారు.

అయితే తన కజిన్ మెహందీ వేడుకలలో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి తీసుకున్న ఫోటోలని రష్మీ షేర్ చేసిందని తెలుసుకొని కూల్ అయ్యారు. మెహందీ పెట్టుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న రష్మీ ఒక కన్ను కొడుతూ టైం టు ఫోటో బాంబ్, మై ఫీడ్ అంటూ రష్మీ పెట్టిన పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది కాగా నువ్వు ఎప్పుడు చేసుకుంటావమ్మా పెళ్లి అంటూ ఆమెపై కొంటె ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. దీనిపై రష్మీ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి.