Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లాలంటే కూడా కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనా.. హిమజ సంచలన వ్యాఖ్యలు!

Bigg Boss: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ తమని తాము నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంటనే ఇండస్ట్రీ నుంచి దూరం అవుతుంటారు ఇక ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే తప్పనిసరిగా కమిట్మెంట్స్ ఇవ్వాలి అంటూ ఎంతో మంది సెలబ్రిటీలు ఇప్పటికే ఈ విషయం గురించి ఓపెన్ అయిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలంటే తప్పనిసరిగా కమిట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుందని ఇలాంటి ఇబ్బందులను తాము ఎదుర్కొన్నాము అంటూ ఎంతోమంది తెలియచేశారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బిగ్ బాస్ బ్యూటీ హిమజ కూడా కమిట్మెంట్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటిస్తూ సక్సెస్ అందుకున్న ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ తర్వాత పూర్తిగా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా సినిమాల ద్వారా బిజీగా గడుపుతున్న ఈమెకు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బిగ్బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అంటే కూడా కమిట్మెంట్స్ ఇవ్వాలట కదా ఇందులో ఎంతవరకు నిజం అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు హిమజ సమాధానం చెబుతూ బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లే వారందరూ కూడా చాలా స్ట్రాంగ్ టఫ్ఫస్ట్ కంటెస్టెంట్లు. వారు ఏ విషయమైనా నిర్మొహమాటంగా ముక్కు సూటిగా మాట్లాడతారు అలాంటి వారిని ఈ హౌస్ లోకి పంపిస్తారు.

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అంటే ఎక్కడ కమిట్మెంట్ అనే పదం వినపడదని తెలిపారు. ఈ షో కోసం తాను మూడు ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి వచ్చింది అయితే ఎక్కడా కూడా నేను ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోలేదు నేను మాత్రమే కాదు నా స్నేహితుడు కూడా కమిట్మెంట్ ఇబ్బందులను ఫీల్ అవ్వలేదని, ఎవరు కొంతమంది అవకాశం రానివారు ఇలా నెగిటివ్ ప్రచారాలు చేస్తారే తప్ప ఇలాంటి కమిట్మెంట్స్ ఉండవని ఈమె క్లారిటీ ఇచ్చారు. ఇలా హిమజ కమిట్మెంట్స్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.