హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రోహిణి.. ఏమాత్రం సంపాదించిందో!

బిగ్ బాస్ సీజన్ 8 తుది అంకానికి చేరుకుంది. దీంతో డబల్ ఎలిమినేషన్స్ నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ టీం.అయితే 14 వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది అని అందరూ అనుకున్నారు కానీ ఫైనల్స్ కి ఐదుగురు కంటెస్టెంట్స్ ని మాత్రమే పంపించాలనే ఉద్దేశంతో ఈవారం కూడా డబల్ ఎలిమినేషన్ పెట్టడంతో రోహిణి ఎలిమినేట్ అయిపోయింది.

అయితే ఎలాంటి టాస్క్ ఇవ్వకుండా కంటెస్టెంట్ స్టాచ్యులని గార్డెన్ ఏరియాలో పెట్టి ఎవరి విగ్రహం కిందన పడిపోతుందో వారి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున చెప్పారు. దాంతో రోహిణి స్టాచ్యూ కిందపడి నేరుగా ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఆమె ఫైనల్స్ కి వెళ్తుందని అందరూ అనుకున్నారు. లేడీ కమెడియన్గా బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన రోహిణి టాస్క్ ల్లో ఆడపులిలా ఆడింది. తనను తక్కువ చేసి జీరో అన్న పృథ్వి పైనే గెలిచి చివరికి మెగా చీఫ్ అయింది.

అలాగే స్టేజి మీద రోహిణి బిగ్ బాస్ జర్నీ వీడియోని కూడా మంచి ఎలివేషన్స్ ఇస్తూ చాలా సేపు ప్రదర్శించారు. అంతలా ఏ కంటెస్టెంట్ కి చూపించలేదు. గెలిచిన వారితో సమానంగా నీకు ఆదరణ లభించిందని నాగార్జున అన్నారు. ట్రోఫీ ఒకటే లేదు కానీ విన్నర్ అయినంత గర్వంగా ఉందని రోహిణి చెప్పటం గమనార్హం. గత సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా వచ్చిన రోహిణి ఈ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఒకవైపు కామెడీతో కడుపుబ్బ నవ్విస్తూనే ఫిజికల్ టాస్కుల్లోనూ ప్రేక్షకులతో ఓటింగ్ లో కూడా సత్తా చూపించింది.

అయితే టాప్ ఫైవ్ కోసం కంటెస్టెంట్స్ సెట్ అయిపోయిన దృష్ట్యా రోహిణి తప్పక ఎలిమినేషన్ కావలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సీజన్లో రోహిణి ఏమాత్రం సంపాదించింది అనే ఉత్సాహం అందరిలోని కలుగుతోంది ఆమె ఈ సీజన్లో ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో చూద్దాం. ఈమె హౌస్ లో 9 వారాలు ఉంది వారానికి రెండు లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం. ఈ ప్రకారం ఆమె 18 లక్షల పారితోషకం అందుకుందని తెలుస్తోంది.