Un stoppable: బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం తెలిసిందే అయితే ఈ కార్యక్రమం ప్రస్తుతం నాలుగవ సీజన్ ప్రసారమవుతుంది. ఇక నాలుగవ సీజన్లో ఇప్పటికే నాలుగు ఎపిసోడ్ లు పూర్తి అయ్యాయి. ఇక చివరిగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ ఎపిసోడ్ తర్వాత తదుపరి ఎపిసోడ్స్ ప్రసారం అవ్వలేదు.
ఇక త్వరలోనే మరొక ఎపిసోడ్ కూడా ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. ఈ షోలో భాగంగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదల కాబోతోంది.
ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వెంకటేష్ బాలయ్య షోలో సందడి చేశారని తెలుస్తోంది. ఇక బాలకృష్ణతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఈ షోలో పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఇలా బాలకృష్ణతో మొదటిసారిగా ఒక టాక్ షోలో విక్టరీ వెంకటేష్ పాల్గొనటం విశేషం. ఇలా వెంకటేష్ బాలయ్య షోలో పాల్గొన్నారు. మరి చిరంజీవి నాగార్జున ఎప్పుడు పాల్గొంటారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ టాక్ షో గా ప్రసారమైన అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం మాత్రం ప్రమోషన్ల కోసమే ఈ షోని ఏర్పాటు చేశారు అంటూ పలువురు ఈ షో పట్ల విమర్శలు కూడా చేస్తున్నారు. ఇక బాలకృష్ణ లాంటి ఒక స్టార్ హీరో చేత సినిమా ప్రమోషన్లను చేయించడం ఏంటి అంటూ అల్లు అరవింద్ పై కూడా విమర్శలు కురిపిస్తున్నారు. కేవలం సినిమా విడుదల సమయంలో మాత్రమే ఈ టాప్ షో కి సంబంధించిన ఎపిసోడ్స్ ప్రసారం కావటం గమనార్హం.