ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్ వద్ద వరుసగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండవ వారంలో కూడా దూసుకుపోతూ ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. అద్భుతమైన కథ, సంగీతం, అల్లు అర్జున్ మాస్ పర్‌ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించాయి.
తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 282.91 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్మురేపిన పుష్ప 2, తొలి వారంలోనే రూ. 1000 కోట్ల మార్క్‌ను చేరింది. హిందీ బెల్ట్‌లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడం విశేషం. రెండవ వారంలో వీకెండ్ కలెక్షన్లు కూడా ఇంతకుముందు వచ్చిన సినిమాల రికార్డులను అధిగమించాయి. కేవలం 14 రోజుల్లోనే ఈ సినిమా రూ. 1450 కోట్ల గ్రాస్‌ను అందుకోవడం టాలీవుడ్ స్థాయిని దేశవ్యాప్తంగా మరింత ఉన్నతంగా నిలబెట్టింది.
ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, హిందీ వెర్షన్ వసూళ్లు కూడా చాలా స్థాయిలో నిలిచాయి. రెండవ శనివారం రూ. 82.56 కోట్లను, ఆదివారం రూ. 104.24 కోట్లను వసూలు చేయడం చూస్తే, ఈ సినిమా నిలకడగా విజయపథంలో దూసుకుపోతున్నట్లు స్పష్టమవుతోంది. సుకుమార్ స్క్రీన్‌ప్లే, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.
ఇప్పటివరకు 14 రోజుల్లో రూ. 1450.13 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిన పుష్ప 2, మూడవ వారంలో క్రిస్టమస్ సెలవులను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా టాలీవుడ్ హిస్టరీలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనూ చారిత్రక విజయాన్ని నమోదు చేస్తూ, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది.