Vijay Devarakonda: రష్మికతో రిలేషన్ బయట పెట్టాల్సిన సమయం వచ్చేస్తోంది.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు!

Vijay Devarakonda: నువ్విలా అనే సినిమా ద్వారా వెండితెరకు నటుడిగా పరిచయమయ్యారు విజయ్ దేవరకొండ ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఈయన అనంతరం పెళ్లిచూపులు అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి గీతగోవిందం వంటి వరుస హిట్ సినిమాల ద్వారా విజయ్ దేవరకొండ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఈయన మాత్రం అనుకున్న స్థాయిలో తన సినిమాల ద్వారా సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పాలి.

ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలోనే ఈయన రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తూ ఉంటాయి. గీత గోవిందం సినిమా సమయం నుంచి విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు ప్రేమలో ఉన్నారని అయితే ఈ ప్రేమ విషయాన్ని మాత్రం బయట పెట్టడం లేదని ఎంతోమంది భావించారు. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కూడా వ్యవహరిస్తున్న తీరు అందరికీ అనుమానాలను కలిగిస్తుంది.

విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు కలిసి వెకేషన్ కు వెళ్లడం ఆ ఫోటోలను వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువవుతున్నాయి వీరిద్దరూ వారి సింగిల్ ఫోటోలను షేర్ చేసినప్పటికీ బ్యాగ్రౌండ్ మాత్రం ఒకే విధంగా ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ కలిసే వెళ్తున్నారని స్పష్టమవుతుంది. ఇక ఇటీవల పుష్ప 2 వేడుకలలో భాగంగా విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్న విషయాన్ని రష్మిక చెప్పకనే చెప్పేశారు.

విజయ్ దేవరకొండ కూడా ఈ విషయంపై స్పందించారు. తాను తన రిలేషన్ గురించి బయట పెట్టాల్సిన సమయం దగ్గర పడుతుందని తెలిపారు. అందరూ కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాలని ఆతృత కనబరిచినప్పుడే తాను ఈ విషయాన్ని చెబుతాను.దీనికి ఓ ప్రత్యేక సమయం, కారణం ఉండాలని ఆయన అన్నారు. అలాంటి రోజున సంతోషంగా తన వ్యక్తిగత జీవితం గురించి అందరికి చెబుతానని ఆయన తెలిపారు. తాను పబ్లిక్ ఫిగర్ కావడంతో తన గురించి తెలుసుకోవడానికి అందరూ ఆత్రుత చూపుతారు దానిని నేను ఒత్తిడిగా భావించను. ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే.. బాధను కూడా మోయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి రష్మికతో తన రిలేషన్ గురించి ఎప్పుడు చెబుతారనేది తెలియాల్సి ఉంది.