వెంకటేశ్వర స్వామి గుడిలో శర్వానంద్ అన్నదానం.. రీజన్ ఏంటబ్బా?

సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకొని ఇప్పుడు హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకున్న నటుడు శర్వానంద్. ఆయన కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలని చేస్తూ ఉంటారు. నటుడు గానే కాకుండా ప్రొడ్యూసర్ గా మారి చేతులు కూడా కాల్చుకున్నాడు. అయితే ఆ నష్టం నుంచి కోలుకోవడానికి ఆరేళ్లు పట్టిందని చెప్పాడు సర్వానంద్.

ఈ మధ్యనే ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్ అందుకున్న శర్వానంద్ తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన మనమే సినిమాతో అంత పెద్ద ఫ్లాప్ ని అందుకున్నాడు. ఇక అతని కెరియర్ విషయం పక్కనబెట్టి పర్సనల్ విషయానికి వస్తే రీసెంట్ గానే ఒక ఇంటివాడైనా శర్వానంద్ రక్షిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన పుట్టినరోజు నాడే తనకి కూతురు పుట్టిందని ఆమెకి లీలాదేవి అనే పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు శర్వానంద్.

ఇప్పుడు కూతురు లీలాదేవితో తో పాటు కుటుంబ సభ్యులందరితో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న టిటిడి టెంపుల్ వద్ద భోజనాలు పెట్టాడు శర్వానంద్. స్వయంగా ఆయనే వడ్డించారు కూడా. వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఏ కారణం చేత ఇలా భోజనాలు పెట్టారు అనే విషయం మీద క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం శర్వానంద్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో 36వ సినిమా రాబోతుంది ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే వర్కింగ్ టైటిల్ సర్వ 37 పేరుతో ఒక సినిమా తెరకెక్కక పోతుంది. సాక్షి వైద్య సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని సామజ వర గమన సినిమా డైరెక్టర్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాలు అయినా సర్వానంద్ కెరీర్ కి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు అతని ఫ్యాన్స్.