Pawan Kalyan: ఆ విషయంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచిన పవన్… మనల్ని ఎవడ్రా ఆపేది?

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా ఎంతో మంచి విజయం సాధించారు. ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇలా రాజకీయాలలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పేరు భారీ స్థాయిలో మారుమోగుతుంది కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ఈయన పేరు నేషనల్ లెవెల్ లో మారుమోగుతుంది.

ఇకపోతే మరికొన్ని రోజులలో 2024 కు ముగింపు పలికి. 2025కు వెల్కమ్ చెప్పబోతున్నాం. కాగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఎన్నో అద్భుతాలు జరిగాయి ఎన్నో వివాదాలు జరిగాయి. ఇక చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో సంచలనాలు చోటుచేసుకున్నాయి. ఇక ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు వివాదాలలో చిక్కుకోవడం కొంతమంది పెళ్లిళ్లు చేసుకోవడం మరి కొంతమంది విడాకులు తీసుకోవడం జరిగింది.

ఇకపోతే 2024 ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటులు, నటీమణుల జాబితాను గూగుల్ విడుదల చేసింది. విశేషమేమిటంటే.. ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసిన నటుల జాబితాలో హీరో టాలీవుడ్ టాప్ 2లో ఉన్నారు. మరి ఆ టాలీవుడ్ హీరో మరి ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి.

హాలీవుడ్ నటుడు కేట్ విలియమ్స్ ప్రపంచంలో అత్యధికంగా సర్చ్ చేసిన నటులలో నంబర్ వన్ గా ఉన్నాడు. ఇక రెండో స్థానంలో నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. విశేషమేమిటంటే 2024లో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు ఒకటి కూడా విడుదల కాలేదు కానీ ఈయన గురించి భారీ స్థాయిలో సెర్చ్ చేశారు. అయితే రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయన గురించి ఎంతోమంది తెలుసుకోవడం కోసం గూగుల్ సెర్చ్ చేశారని తెలుస్తుంది. ఇలా గూగుల్ సెర్చ్ లో ప్రపంచంలోనే రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ నిలవడంతో అభిమానులు మనల్ని ఆపేది అంటూ ఆయన డైలాగ్ తోనే ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.