Uday Kiran: రాజమౌళి ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సయిన సినిమా అదేనా.. చేసి ఉంటే ఉదయ్ కిరణ్ లైఫ్ మరోలా ఉండేది?

Uday Kiran: తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు దర్శకుడు రాజమౌళి. ఈయన దర్శకత్వంలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ ఎంతో మంచి సక్సెస్ అయ్యాయి ఇక ఈయన దర్శకత్వంలో చేసిన హీరోలు అందరూ కూడా ప్రస్తుతం ఎంతో మంచి క్రేజీ సొంతం చేసుకున్నారు. ఇలా రాజమౌళి దర్శకత్వంలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కూడా ఓ సినిమాలో నటించాల్సి ఉండేదట.

నిజంగానే రాజమౌళి ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో కనుక సినిమా వచ్చి ఉంటే నేడు ఉదయ్ కిరణ్ మన మధ్య ఉండేవారని ఆయన కెరియర్ మరోలా ఉండేదని అభిమానులు భావిస్తున్నారు. మరి వీరి కాంబినేషన్లో మిస్ అయినటువంటి ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే..కిరణ్‌తో రాజమౌళి కూడా ఒక ను ప్లాన్ చేశాడట. ఎన్టీఆర్ తో ‘స్టూడెంట్ నెంబర్ 1’ తెరకెక్కిస్తోన్న సమయంలోనే స్టోరీ కూడా రాసుకున్నాడట. అయితే ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ ప్లేసులో నితిన్ ను తీసుకున్నారని తెలుస్తుంది.

ఇలా ఉదయ్ కిరణ్ హీరోగా రాజమౌళి సై సినిమా చేయాలని భావించారట కొన్ని కారణాలవల్ల ఉదయ్ కిరణ్ స్థానంలోకి నితిన్ రావడం జరిగింది లేదంటే ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి తన కెరీర్ కు ఎలాంటి డోకా లేకుండా ఉండేది దీంతో ఆయనకు ఆర్థిక సమస్యలు వచ్చేవి కాదు చనిపోవాలని ఆలోచన కూడా వచ్చి ఉండేది కాదని ఈ సినిమా చేసి ఉంటే నేడు ఉదయ్ కిరణ్ ప్రాణాలతో ఉండేవారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న ఉదయ్ కిరణ్ ఎంత తొందరగా అయితే స్టార్ హీరో అయ్యారు అంతే తొందరగా డౌన్ ఫాల్ అయ్యారు. ఇలా ఆయనకు అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి తద్వారా ఆత్మహత్య ఈ సమస్యలకు పరిష్కారమని ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఉదయ్ కిరణ్ మరణం ఇప్పటికీ అభిమానులకు జీర్ణించుకోలేనిదిగా ఉంది.