Venu Swamy: టాలీవుడ్ ఇండస్ట్రీకి నేనే శాపం పెట్టాను… అందుకే సెలబ్రిటీలకు ఇబ్బందులు: వేణు స్వామి

Venu Swamy: సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి జ్యోతిష్యులు వేణు స్వామి ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదాలకు నా శాపమే కారణమంటూ ఈయన చెప్పకనే చెప్పేశారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో చోటు చేసుకున్నటువంటి ఈ వివాదాలు నన్ను గెలకటం వల్లే వచ్చాయని తెలిపారు.

ఈయన సినిమా సెలబ్రిటీల గురించి వారి జాతకాల గురించి చెప్పడంతో చాలామంది తనని విమర్శించారు అంతేకాకుండా కొంతమంది తనపై కేసులు కూడా నమోదు చేశారు దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తాను శాపం పెట్టానని తెలిపారు. ఈ వివాదాల తర్వాత నన్ను విమర్శించిన వారు ఇప్పుడు నోరు మూసుకొని ఉన్నారని ఈయన తెలిపారు. ఇలాంటి సంచలనాలు జరుగుతాయని తాను ఆగస్టులోనే చెప్పానంటూ వేణు స్వామి తెలిపారు.

ఇక ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి సెలెబ్రిటీలు వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు ముఖ్యంగా నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయటం, కొండా సురేఖ నాగచైతన్య సమంత విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో ఒక్కసారిగా చర్చలకు కారణమైంది.

సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి రాంగోపాల్ వర్మపై కేసు నమోదు కావడం పోలీసులు తనని వెంటాడడం జరిగింది. ఇక మంచు మోహన్ బాబు కుటుంబంలో భగ్గుమన్న ఆస్తి గొడవలు ఈ గొడవలు కారణంగా ఇంటి రచ్చ కాస్త వీధికి వచ్చింది. వీరంతా రోడ్డుపైన ఒకరినొకరు కొట్టుకోవడం పోలీస్ స్టేషన్లకు వెళ్లడం వంటివి జరిగాయి.

ఇక తాజాగా పుష్ప 2 సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ అల్లు అర్జున్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ తప్పు లేకపోయినా ఆయనపై తప్పును మోపుతూ పోలీసులు తనని అరెస్టు చేయడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంది. ఇక అల్లు అర్జున్ మద్యంతర బెయిలు మీద బయటకు వచ్చిన ఈ కేసు మాత్రం తనని వెంటాడుతూనే ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ వివాదాలన్నింటికీ వేణు స్వామి శాపమే కారణమని తనని గెలవడం వల్లే ఇలా వివాదాలలో నిలిచారనీ ఈయన చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.