Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇలా ఒకరోజు పాటు ఈయన జైలులో ఉన్న నేపథ్యంలో ఎంతో మంది సినీ సెలబ్రెటీలు అల్లు అర్జున్ పరామర్శిస్తూ వచ్చారు. మద్యంతర బెయిల్ మీద అల్లు అర్జున్ బయటకు వచ్చారు. అల్లు అర్జున్ జైలు నుంచి రావడంతో సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా ఆయన ఇంటికి వెళ్లి తనని పరామర్శించి వచ్చారు..
ఇకపోతే మరుసటి రోజు అల్లు అర్జున్ తన మామయ్య అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి నేరుగా ఆయనతో కలిసి మాట్లాడారు అనంతరం నాగబాబు ఇంటికి కూడా అల్లు అర్జున్ వెళ్లారు. ఈ విధంగా అల్లు అర్జున్ మెగా మావయ్యలను కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఈయన పవన్ కళ్యాణ్ ని కూడా కలవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాదులో లేరు కనుక ఆయనను కలవాలి అంటే తప్పనిసరిగా మంగళగిరి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ చేత పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం అల్లు అర్జున్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నుంచి ఏ విధమైనటువంటి సమాధానం రాకపోవడం గమనార్హం.
పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కు అపాయింట్మెంట్ ఇవ్వనని చెప్పలేదు కానీ ఆయన ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వలేదు అయితే ఈ విషయం గురించి ఇటు రాజకీయాలలో మరోసారి చర్చలు జరుగుతున్నాయి అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ కావాలని ఆపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అంటూ కొందరు చర్చలు జరుపుతున్నారు. నిజానికి అల్లు అర్జున్ మీద కేసు ఉన్న నేపథ్యంలో ఈయన ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదు కనుక అల్లు అర్జున్ గురించి వస్తున్న ఈ వార్తలలో నిజం లేదని తెలుస్తోంది.