రీసెంట్ గా విడుదలైన పుష్ప యునిక్ సాంగ్..సుక్కు పై ఫైర్ అవుతున్న ఫాన్స్!

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్పట్టు సినిమా సృష్టిస్తున్న సునామి ఇప్పుడప్పుడే తగ్గేటట్లుగా కనిపించడం లేదు. సినిమా విడుదలవ్వకముందే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలైన తరువాత మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది. 1500 కోట్ల క్లబ్లో చేరటానికి అతి సమీపంలో ఈ సినిమా. అయితే ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉన్న కారణంగా ఇందులో చాలా సీన్స్ కట్ చేసేసారని టాక్.

అయితే రీసెంట్ గా ఆ సీన్స్ ని యాడ్ చేస్తూ టైటిల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు మూవీ టీం. ఇప్పటికే ఈ సాంగ్ పలు భాషలలో 250 ప్లస్ మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. తెలుగులో ఈ పాటని నకాష్ అజీజ్, దీపక్ బ్లూ ఆలపించారు. మ్యూజిక్ డైరెక్షన్ దేవిశ్రీప్రసాద్ అందించారు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సాంగ్ లో డిలీట్ చేసిన సీన్స్ ఉండటంతో ఇంత మంచి సీన్స్ ఎందుకు సినిమాలో డిలీట్ చేసేసారు అంటూ దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సదరు ప్రేక్షకులు.

చిన్నప్పుడు ఎక్కడైతే తనని స్నేహితులు క్రికెట్ ఆడనివ్వలేదో అక్కడే పిల్లలతో క్రికెట్ టోర్నీని నిర్వహిస్తాడు పుష్ప. అలాగే పిల్లలందరూ పుష్ప మేనరిజాన్ని,స్టైల్ ని స్టెప్స్ ని అనుకరించడం సాంగ్లో ఉంటుంది. అయితే ఈ సీన్స్ ఏవి సినిమాలో ఉండవు. ఈ సీన్స్ సినిమాలో పడితే మరింత బాగుండేది అంటున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పటికే సినిమా నిడివి మూడు గంటల 20 నిమిషాలు కావడంతో థియేటర్ వర్షన్లో ఆ సీన్స్ యాడ్ చేసే అవకాశం లేదు.

అలాగే ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ కూడా సినిమాలో లేకపోవడం పట్ల కొందరు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అలాగే సునీల్, అనసూయ సీన్స్ కూడా కొన్ని సినిమా లో మిస్ అయ్యాయి. అలాగే ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ని కూడా నిడివి కోసమే అర్ధాంతరంగా ఆపేశారని పెదవి విరుస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆ సీన్స్ ని పుష్ప 3 కంటిన్యూషన్ కోసం సుకుమార్ దాచినట్లు చెప్తున్నారు. మరి ఈ విషయంపై సుకుమార్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

PUSHPA PUSHPA Telugu Film Version - Pushpa 2 The Rule | Allu Arjun | Sukumar | DSP