విక్టరీ వెంకటేష్ హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎక్సటెన్సీవ్ ప్రమోషన్లతో ఇప్పటికే స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఇందులో వెంకటేష్ ఎక్స్ కాప్ పాత్రలో, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి అతని ఎక్స్ లవర్ గా కనిపించనున్నారు. బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ సింగిల్ గోదారి గట్టు, గ్లోబల్ టాప్ 20 వీడియోల లిస్టు లోకి ఎంటరైయింది.
సెకండ్ సింగిల్ ‘మీను’ ప్రోమో వెంకటేష్ పుట్టినరోజున విడుదలై ఫుల్ కోసం కోసం ఉత్సాహాన్ని రేకెత్తించింది, ఈ రోజు ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యే మరో మెస్మరైజింగ్ నెంబర్ ని భీమ్స్ కంపోజ్ చేశారు. భార్య పాత్ర పోషించిన ఐశ్వర్య రాజేష్ తో తన ప్రేమ కథను వెంకటేష్ వివరిస్తున్నట్లు ఈ పాట చిత్రీకరించారు. పోలీస్ అకాడమీలో ట్రైనర్‌గా పనిచేస్తున్నప్పుడు, అతను తన ట్రైనీ మీనాక్షితో ప్రేమలో పడతాడు. వారు వివిధ ప్రదేశాలను సందర్శిస్తారు, కలిసి కొన్ని మంచి క్షణాలను పంచుకుంటారు. వారి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, అతను ఆమెను ముద్దు పెట్టుకోకుండా తప్పించుకుంటాడు, తన మొదటి ముద్దు తన భార్యతో మాత్రమే అని రివిల్ చేస్తాడు.
వెంకటేష్ మీనాక్షిని ముద్దుపెట్టుకునే అవకాశాన్ని పొందిన ఇంటెన్స్ మూమెంట్ తో సాంగ్ లో చాలా బ్యూటీఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఈ పాటకు అనంత శ్రీరామ్ బ్యూటీఫుల్ లిరిక్స్ రాశారు. ప్రణవి ఆచార్యతో కలిసి భీమ్స్ అద్భుతంగా పాడారు. వెంకటేష్, మీనాక్షితో పాటు ఐశ్వర్యతో లవ్లీ కెమిస్ట్రీని పంచుకున్నారు. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రాఫర్. తప్పకుండా ఈ పాట కూడా స్మాషింగ్ హిట్ అవుతుంది.
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్
VFX: నరేంద్ర లోగిసా
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా
మార్కెటింగ్: నాని