Pushpa 2: సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో అజయ్ కూతురి పాత్రలో పావని కారణం అనే నటీ నటించారు. పాత్రలో నటించిన పావని అల్లు అర్జున్ ని చిన్న నాయనా అని పిలుస్తూ కనిపిస్తారు ఇక పుష్ప 2 లో ఈమె పాత్ర చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే ఈమె పాత్ర ద్వారా సినిమా మొత్తం ఒక మలుపు తిరుగుతుంది.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పాల్గొన్న నటి పావని తన పాత్రకు కావేరి అని పేరు పెట్టడం వెనుక ఉన్న అర్థాన్ని బయటపెట్టారు. పుష్ప 2 లో వచ్చే జాతర సన్నివేశం వరకు నా పాత్రకు సుకుమార్ గారు పేరు పెట్టలేదు అప్పటివరకు అందరూ పావని అని పిలిచేవారు నా ఒర్జినల్ పేరు కూడా అదే కావడంతో నా పాత్ర పేరే పావని అనుకున్నాను. అయితే ఈ జాతర సీన్ షూటింగ్ జరిగే సమయంలో సుకుమార్ గారు మీ ఒరిజినల్ పేరు పావని నేనా అని అడిగారు అవునని చెప్పడంతో అయితే నీ పాత్రకు నామకరణం చేయాల్సిన సమయం వచ్చింది అంటూ ఆయన కావేరి అని పెట్టారు.
ఇలా నా పాత్రకు కావేరి అని పేరు పెట్టడానికి గల కారణాన్ని కూడా సుకుమార్ గారు తెలిపారు. కావేరి అనేది ఒక నది పేరు ఈ నది తమిళనాడును అటు కర్ణాటకను కలుపుతుంది అలాగే ఈ సినిమాలో నా పాత్ర కూడా ఇటు నా కుటుంబాన్ని అంటూ తన చిన్ననాయన పుష్ప కుటుంబాన్ని కూడా కలిపేది కావడంతో తన పాత్రకు కావేరి అని పేరు పెట్టినట్లు ఈ సందర్భంగా పావని తెలిపారు.
ఇలా కథకు అనుగుణంగా పాత్రకు ఈ పేరు పెట్టడంతో సుకుమార్ గారి అనాలసిస్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒక పాత్ర పేరుకే ఇంత ఆలోచించావంటే దండం అయ్యా నీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.