Jabardasth Ram Prasad: జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ కు యాక్సిడెంట్.. రెప్పపాటులో అలా!

Jabardasth Ram Prasad: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి మనందరికీ తెలిసిందే. ఎంతోమంది కమెడియన్లకు జీవితాన్ని ఇచ్చి, వెండితెరకు కూడా పరిచయం చేసింది జబర్దస్త్. చాలామంది ఈ షో ద్వారా బాగా పాపులారిటీ తెచ్చుకోవడం తో పాటు వెండితెరపై హీరోగా డైరెక్టర్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఆటో రాంప్రసాద్ కూడా ఒకరు. ఆటో పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు రాంప్రసాద్. జబర్దస్త్ షోలో మొదటి నుంచి సుడిగాలి సుదీర్ టీం లో చేస్తూ బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఒకవైపు జబర్దస్త్ షో చేస్తూనే మరొకవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ, పండుగ ఈవెంట్లు స్పెషల్ ఈవెంట్లు చేస్తూ బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ లో ఉన్న కమెడియన్స్ అందరూ ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తున్నారని చెప్పవచ్చు. అందులో రాంప్రసాద్ కూడా ఒకరు. ఇకపోతే అసలు విషయానికి వస్తే.. తాజాగా రాంప్రసాద్ కు యాక్సిడెంట్ అయ్యింది. ఎప్పటిలాగే జబర్దస్త్ షూటింగుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన కారులో వెళుతుండగా ముందు ఉన్న కారు సడన్ గా బ్రేక్ వేయడంతో రాంప్రసాద్ కూడా బ్రేక్ వేశాడు. ఆ తర్వాత వెనకాలే వస్తున్న ఆటో కూడా బ్రేక్ వేసింది. దీంతో ఈ మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొట్టాయి.

ఈ ప్రమాదంలో రాంప్రసాద్ కి చిన్న చిన్న గాయాలు అయినట్టు తెలుస్తోంది. అలా తృటీలో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఆయనకు చిన్నచిన్న గాయాలు అవ్వడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ రావడంతో ఆయన లేచిన వేళా విశేషం బాగుంది చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఈ సంఘటన అనంతరం ప్రసాద్ ను అంబులెన్స్ లో హాస్పిటల్ తరలిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.