తామర పువ్వుతో ఈ పరిహారాలు చేస్తే చాలు.. ఆర్థిక ఇబ్బందులన్నీ మటుమాయం!

సాధారణంగా ప్రతి ఒక్కరు వారి జీవితం ఎంతో సుఖసంతోషాలతో సాగిపోవాలని భావిస్తారు. ఈ క్రమంలోనే కష్టపడి పని చేస్తూ తమకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖసంతోషాలతో ఉండాలని పెద్ద ఎత్తున లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతి శుక్రవారం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలని ప్రార్థిస్తారు.

ఇకపోతే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉండాలంటే మనం తామర పువ్వుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులతో శుక్రవారం పూజ చేయటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. తామర పువ్వుకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది. ఇక పరమేశ్వరుడికి తామర పుష్పాలతో పూజ చేయటం వల్ల మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని భావిస్తారు.

ఇకపోతే తెలుపు రంగు తామర పుష్పాలతో 11 వారాలపాటు లక్ష్మీదేవికి పూజ చేయడం ఎంతో మంచిది.ఈ విధంగా 11 వారాలపాటు లక్ష్మీదేవిని తెల్లని తామర పుష్పాలతో పూజ చేసి పదకొండవ వారం ఆ పుష్పాలను పారుతున్న నీటిలో వేయాలి.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మన పైనే ఉంటుంది. అలాగే మన ఇంట్లో సిరిసంపదలకు ఏమాత్రం లోటు ఉండదని పండితులు తెలియజేస్తున్నారు.