రోడ్డుపై డబ్బులు దొరికితే తీసుకోవచ్చా.. ఆ డబ్బులు తీసుకుంటే లాభమా? నష్టమా?

మనలో చాలామందికి ఏదో ఒక సందర్భంలో రోడ్డుపై డబ్బులు దొరుకుతుంటాయి. కొంతమంది ఆ డబ్బులను తీసుకోవడానికి ఆసక్తి చూపితే మరి కొందరు మాత్రం ఆ డబ్బులను తీసుకోవడానికి సందేహిస్తూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం రోడ్డుపై పడి ఉన్న డబ్బులను తీసుకోవడం ద్వారా శుభం కలుగుతుంది. ఈ డబ్బులు తీసుకోవడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని చాలామంది భావిస్తారు.

రోడ్డుపై పడిన డబ్బును అలాగే వదిలేయడం మాత్రం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. డబ్బులు దొరికిన సమయంలో ఏవైనా పనులు చేపడితే ఆ పనులలో సైతం సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. డబ్బులు దొరకడం వల్ల ఆర్థికంగా కూడా లాభాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. డబ్బులు దొరికిన వాళ్లు ఆర్థికంగా లాభాలను పొందవచ్చు.

దొరికిన డబ్బులను సొంత ఖర్చుల కోసం వాడుకోవడం ఇష్టం లేని వాళ్లు ఆ డబ్బులను ఏదైనా గుడికి విరాళంగా ఇస్తే మంచిదని చెప్పవచ్చు. ఆ డబ్బులను ఏదైనా కొత్త చేసే పని కోసం వినియోగించడం ద్వారా కూడా మంచి ఫలితాలను సొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఎక్కువ మొత్తంలో డబ్బులు దొరికితే మాత్రం ఆ డబ్బులను పోలీసులకు అప్పగిస్తే మంచిది.

కొంతమంది మాత్రం దొరికిన డబ్బులను ఖర్చు చేయడం మంచిది కాదని ఆ డబ్బులను దాచుకోవాలని సూచనలు చేస్తున్నారు. అయితే డబ్బులను పోగొట్టుకున్న వాళ్లు మాత్రం ఆ డబ్బును పోగొట్టుకోవడం వల్ల ఎంతో బాధ పడతారు. డబ్బులను పోగొట్టుకున్న వాళ్ల వివరాలు తెలిస్తే మాత్రం ఆ డబ్బులను వెంటనే తిరిగి ఇచ్చేస్తే మంచిదని చెప్పవచ్చు.