దీపావళి రోజున ఇవి దానం చేస్తే కోటీశ్వరులు అవుతారట.. ఏమేం చేయాలంటే?

హిందువులకు అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి అనే సంగతి తెలిసిందే. దీపావళి పండుగను దేశ ప్రజలంతా అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయని చాలామంది భావిస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మంచి ఫలితాలు కచ్చితంగా చేకూరుతాయని చెప్పవచ్చు.

దీపావళి పండుగ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. దీపావళి పండుగ సమయంలో చీపురు దానం చేస్తే ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చెప్పవచ్చు. పేదలకు ఆహారం, స్వీట్లు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. ఈరోజు కుబేరుడిని పూజించడం వల్ల మనపై కుబేరుని అనుగ్రహం కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.

దీపావళి పండుగ రోజున గోవులకు సేవ చేయడం ఎంతో మంచిది. గోవులు ఉండే ఆశ్రమాలకు సహాయం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. దీపావళి రోజున ఇనుమును, ఉప్పును దానం చేయకూడదు. ఈరోజు అప్పు ఇవ్వడం తీసుకోవడం చేయకూడదు. ఈ తప్పులు చేస్తే మాత్రం తిప్పలు తప్పవని చెప్పవచ్చు.

దీపావళి పండుగ రోజున చెప్పులు, బూట్లు దానం ఇవ్వడం కూడా మంచి పద్ధతి కాదు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. దీపావళి పండుగ రోజున ఎలాంటి తప్పులు చేయకూడదు.