హిందూ మతంలో తులసి మొక్కకు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తులసి మొక్క లక్ష్మీదేవిస్వరూపం అని చాలామంది భావిస్తారు. శ్రీ మహా విష్ణువుకు తులసిని నైవేద్యంగా పెడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉండగా తులసి మొక్కను పూజించడం వల్ల సంపద రెట్టింపు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
ఇంటికి దగ్గర్లో తులసి మొక్క ఉంటే ఇంట్లోకి ప్రతికూల శక్తులు వచ్చే అవకాశం ఉండదు. అయితే తులసి మొక్కను కొన్ని దిక్కులలో మాత్రం అస్సలు పెట్టకూడదు. తులసి మొక్క విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తే మాత్రం కోరి కష్టాలను తెచ్చుకున్నట్టు అవుతుందని పండితులు వెల్లడిస్తున్నారు. తులసి మొక్కను తూర్పు దిక్కులో ఉంచితే శుభ ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది.
తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు అనువైన స్థలం లేని వాళ్లు మాత్రం ఉత్తరం లేదా ఈశాన్య దిశలో తులసి మొక్కను ఉంచితే మంచిది. ఈ దిక్కులలో తులసి మొక్కను నాటితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటంతో పాటు ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. తులసిని దక్షిణ దిశలో మాత్రం అస్సలు ఉంచకూడదు. తులసిని దక్షిణ దిక్కులో ఉంచితే కుటుంబ కలహాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది.
తులసి మొక్కను నాటేందుకు కార్తీక మాసాన్ని ఉత్తమ సమయం అని పండితులు చెబుతున్నారు. ఛైత్ర మాసంలోనూ శుక్రవారం రోజున తులసి మొక్కలను నాటడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ముళ్ల పొదలకు దగ్గర్లో , ఇంటి పైకప్పు మీద తులసి మొక్కను ఉంచకూడదు. సూర్య, చంద్ర గ్రహణం రోజున తులసి మొక్కను కనీసం తాకకూడదు.