ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు, కార్యదర్శులు

టి ఎఫ్ సి సి /2025 22-03-25
ప్రచురణార్ధం

ఆంధ్రప్రదేశ్ తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినందుకు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి. పర్యాటక సంస్కృతీ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి, మేనేజింగ్ డైరెక్టర్ గారికి, ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ లకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరపున తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను ముందుకు తెస్తూ ఆంధ్రప్రదేశ్ లో స్టూడియో ల నిర్మాణం, ఫిలిం ఇండస్ట్రీ కి సంబందించిన వారికి గృహ నిర్మాణం కోసం భూమి కేటాయింపు వంటి ప్రతిపాదనలను తెలియచేసినామని మరియు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ వేగవంతమైన అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా పూర్తి సహకారం ఉంటుందని తెలియచేయుచున్నాము.

కావున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాలలో త్వరితగతిన తగిన చర్యలను తీసుకోవాలని మిక్కిలి వినయ పూర్వకంగా కోరుచున్నాము. తద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో చలన చిత్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలకనుగుణంగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తమ వంతు కృషి చేస్తుందని తెలియచేయుచున్నాము.

(పి. భరత్ భూషణ్) (కె.యల్. దామోదర్ ప్రసాద్) (కె. శివ ప్రసాద్ రావు)
అధ్యక్షులు గౌరవ కార్యదర్శులు