ఇంట్లో చనిపోయిన బల్లి కనిపిస్తే అరిష్టమా.. చనిపోయిన బల్లి కనిపిస్తే అలా చేయాలా?

మనలో చాలామంది ఇంట్లో చనిపోయిన బల్లిని ఏదో ఒక సందర్భంలో చూసే ఉంటారు. ఇంట్లో కనిపించే బల్లి ఎన్నో సంకేతాలను ఇస్తుందని చాలామంది భావిస్తారు. బల్లి శరీరంలోని కొన్ని భాగాలపై పడితే అదృష్టం కలిసొస్తుందని మరికొన్ని శరీర భాగాలపై పడితే మాత్రం చెడు జరుగుతుందని చాలామంది భావిస్తారు. బల్లి లక్ష్మీదేవికి ప్రతీక అనే సంగతి కూడా తెలిసిందే. లక్ష్మీదేవి రాకను బల్లి సూచిస్తుందని చాలామంది భావిస్తారు.

అయితే ఇంట్లో చనిపోయిన బల్లి కనిపిస్తే మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అనే సందేహం చాలామందిని వేధిస్తూ ఉంటుంది. కొత్త ఇంట్లో చనిపోయిన బల్లి కనిపిస్తే మాత్రం చెడు జరుగుతుందని భావించాలి. ఎవరి ఇంట్లో అయితే చనిపోయిన బల్లి కనిపిస్తుందో ఆ ఇంట్లో ఇంటిపెద్ద అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. అదే సమయంలో నేలపై బల్లిని చూడటం కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

నేలపై చనిపోయిన బల్లి కనిపించిన వెంటనే నియమ నిబంధనల ప్రకారం పూజలు చేయడం ద్వారా ఆ బల్లి ప్రభావం మనపై పడకుండా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి సైతం తగ్గుతుందని చెప్పవచ్చు. రెండు బల్లులు పోట్లాడుకోవడం చూసినా దానిని అశుభానికి సంకేతం అని మీరు భావించవచ్చు. బల్లి మీద పడితే వాస్తు శాస్త్రం ప్రకారం పరిహారాలు చేయాలి.

బల్లి విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే పండితులను సంప్రదించడం ద్వారా ఆ సందేహాలకు సులభంగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. గృహ ప్రవేశం సమయంలో బల్లులు కనిపిస్తే అది పెద్దవారి రాకకు సంకేతం అని గుర్తుంచుకోవాలి. ఆలయంలో లేదా దేవుని గుడిలో బల్లి కనిపించినట్టయితే ధనం, సంతోషాన్ని పొందవచ్చని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.