టీడీపీ అధినేత చంద్రబాబు.. పొత్తులో భాగంగా మిగిలిన పార్టీలకు కేటాయించిన సీట్లు, టీడీపీ పోటీచేయబోయే సీట్ల వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా… జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్ సభ.. బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలూ కేటాయించినట్లు ప్రకటించారు. ఇక మిగిలిన 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని తెలిపారు. దీంతో… పవన్ పై జనసైనికులు మరింత ఫైరవుతున్నారని తెలుస్తుంది.
ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే… “టీడీపీ వేసే ముష్టి 20 సీట్లను తీసుకుని.. జనసైనికుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతానా..? గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే టీడీపీతో పొత్తు ఉంటుంది” అని భారీ భారీ డైలాగులు కొట్టారు పవన్. దీంతో… పవన్ కి రెండు రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అందులో ఒకటి… ఇది ముష్టి కాదా..? అని కాగా… మరొకటి… ఇది ఏ రకంగా గౌరవప్రదమైన సీట్లో చెప్పగలరా..? అని!
ఒకప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేరు. బలమైన ప్రసంగాలు.. బరువైన మాటలు.. పదునైన విమర్శలు.. జనసైనికుల ఆత్మాభిమానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం.. వంటివి పవన్ లో స్పష్టంగా కనిపించేవి. అయితే… ఇప్పుడు ఆ పవన్ కల్యాన్ లేరని అంటున్నారు ఆయన అభిమానులు. ఇప్పుడు అంతా చంద్రబాబు వెనుక నడుస్తూ.. “ఐ వన ఫాలో ఫాలో ఫాలో యూ..” అని సాగుతున్న రాజకీయ నాయకుడు మాత్రమే కనిపిస్తున్నాడని అంటున్నారు.
వాస్తవానికి గత ఎన్నికల్లో సుమారు 40కి పైగా స్థానాల్లో జనసేనకు 10వేలకు పైగా ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు ఉన్నాయని.. ఇదే సమయంలో సుమారు 60 నియోజకవర్గాల్లో గెలుపును ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నామని జనసైనికులు చెబుతుండేవారు. ఎట్టిపరిస్థితుల్లోనూ 40కి తగ్గకుండా సీట్లు దక్కించుకోవాలని పవన్ కు అన్ని రకాలుగానూ చెప్పి చూశారు.
అయితే… ఒకసారి బానిసత్వ పోకడలకు అలవాటుపడిన తర్వాత.. అందులో నుంచి బయటకు రావడం ఎంత కష్టమనే విషయం పవన్ ని చూసిన తర్వాత ఆయన ఫ్యాన్స్ కి ఇప్పుడు తెలుస్తున్నట్లుంది. వైఎస్ జగన్ ఇటీవల జరిగిన సిద్ధం సభలో చెప్పినట్లు… చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లుగా పవన్ లో బానిసత్వ పోకడలు పెరిగిపోయాయనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.
సో… ఈ 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానలపై కూడా జనసైనికులు హోప్స్ పెట్టుకోవద్దు. ఇందులో టీడీపీ నుంచి టిక్కెట్ కోసం జనసేనలో చేరే బాబు బ్యాచ్ కి కూడా కొన్ని ఇవ్వాల్సి రావొచ్చు. నామినేషన్స్ ప్రక్రియ ముగిసే నాటికి ఎన్ని సీట్లు దక్కితే అన్నే ఫైనల్. అప్పటివరకూ ఈ 21కి కూడా ఫిక్సయిపోవద్దని పలువురు సూచిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా… జనసేనకు కేటాయిచిన సీట్లను మాత్రం పవన్ మాటలను బట్టి చూస్తే… గౌరవప్రదమైన ముష్టిగానే అభివర్ణిస్తున్నారు!!