Allu Arjun-kiran Abbavaram: కిరణ్ అబ్బవరంకు క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్.. అసలేం జరిగిందంటే!

Allu Arjun-kiran Abbavaram: ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప 2 హంగామానే కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన తర్వాత ఈ సినిమా మరింత ట్రెండింగ్ లోకి వచ్చింది. 24 గంటలు కూడా గడవకముందే ఈ సినిమా ట్రైలర్ అన్ని భాషల్లో విడుదల అవ్వడంతో పాటు 100 మిలియన్లకు పైగా వ్యూస్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేవలం ఒక్క తెలుగులోనే ఈ ట్రైలర్ 50 మిలియన్లను దాటేట్టు కనిపిస్తోంది. కేవలం 15 గంటల్లోనే 40 మిలియన్లకు వ్యూస్‌ ను రాబట్టిన సంగతి తెలిసిందే.

ట్రైలర్ దెబ్బకు సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ ట్రైలర్‌ను మన టాలీవుడ్ సెలెబ్రిటీలు ప్రశంసిస్తున్నారు. దర్శక, నిర్మాతలు, హీరోలంతా కూడా పుష్ప 2 ట్రైలర్‌ను మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది ఈ సినిమా ట్రైలర్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. దాంతో యూట్యూబ్‌ లో పుష్ప 2 ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. అయితే తాజాగా పుష్ప 2 ట్రైలర్‌ మీద కిరణ్ అబ్బవరం ట్వీట్ వేశాడు. వైల్డ్ ఫైర్.. డిసెంబర్ 5 కోసం వెయిటింగ్ అంటూ ట్వీట్ వేశాడు. ఈ ట్వీట్‌కు బన్నీ రిప్లై ఇచ్చాడు.

థాంక్యూ బ్రదర్.. బిజీగా ఉండటం వల్ల మీ సినిమాను చూడలేకపోయాను. క్షమించండి.. నేను క మూవీని చూసి మీకు కాల్ చేస్తా అని బన్నీ అన్నాడు. దీనికి మళ్లీ కిరణ్ అబ్బవరం స్పందిస్తూ థాంక్యూ అన్నా అని రిప్లై ఇచ్చాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు అలాగే కిరణ్ అబ్బవరం అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.