Pushpa 2: పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన పుష్ప సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో సీక్వెల్ చిత్రంగా త్వరలోనే పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. డిసెంబర్ ఐదో తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
ఇకపోతే ఈ సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇకపోతే చివరిలో ఈ సినిమాకి మరొక మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి థమన్ కూడా భాగం కావడంతో ఈ సినిమాపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉన్నఫలంగా దేవిశ్రీని కాకుండా తమన్ ను తీసుకోవడానికి కారణాలేంటని ఆరా తీయడం మొదలుపెట్టారు అయితే ఈ విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ క్లారిటీ ఇచ్చారు.
పుష్ప 2 సినిమాలో తాను కేవలం ఒక చిన్న పార్ట్ మాత్రమే అంటూ బాలకృష్ణ డాకు మహారాజా సినిమా ఈవెంట్లో ఈయన క్లారిటీ ఇచ్చారు. ఇలా ఈ సినిమాలో తాను కూడా భాగం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ ఎస్ఎస్ తమన్ మాత్రమే కాకుండా మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పనిచేశారు అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది.
ఈ సినిమా కోసం వీరిద్దరూ మాత్రమే కాకుండా అజనీష్ లోకనాథ్, సామ్ సీఎస్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారని తెలుస్తుంది. అయితే వీరిద్దరి పేర్లను మాత్రం అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. ఇక ఈ సినిమా ఎడిటింగ్ పనులను చూసినటువంటి తమన్ సినిమా గురించి మాట్లాడుతూ తాను ఇప్పటికే ఈ సినిమా చూశానని సినిమా మొత్తం చాలా గొప్పగా వచ్చిందని, సినిమా విడుదలైన తర్వాత అవార్డులన్నీ బన్నీ ఇంటికి పరిగెత్తుతూ వెళ్తాయంటూ తమన్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ అభిమానులలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.