పరగడుపున తులసి ఆకులను తీసుకుంటే ఇన్ని లాభాలా.. ఆ సమస్యలకు చెక్!

హిందువులలో చాలామంది తులసి చెట్టును కచ్చితంగా ఇంట్లో పెంచుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తులసి చెట్టుకు పూజలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చని చాలామంది భావిస్తారు. తులసిలో ఉండే గొప్ప గుణాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జ్వరం, కఫం లాంటి సమస్యలకు తులసి ద్వారా పరిష్కారం లభిస్తుంది.

ఉదయం సమయంలో రెండు తులసి ఆకులు తీసుకోవడం ద్వారా గ్యాస్ సమస్యతో పాటు గుండె సమస్యలు సైతం దూరమవుతాయి. తులసి తీసుకోవడం ద్వారా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనని దూరం చేయడంతో పాటు జీర్ణ సమస్యలు కూడా దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. వేడి నీటిలో 1, 2 టీ స్పూన్ల తులసి ఆకులని కలిపి 5, 10 నిమిషాలు ఉడకబెట్టి చల్లారిన తర్వాత తాగితే మంచిది.

తులసిలోని యూజినాల్ అనే సమ్మేళనం, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంతోపాటు వాపుని తగ్గించడంలో తోడ్పడుతుంది. తులసీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రంలోని కొవ్వుని కరిగించి బరువుని తగ్గించడంలో తోడ్పడతాయి. తులసి ఆకులు అలర్జీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. తులసి ఆకులు మానసిక స్థితిని మెరుగుపరచడంతోపాటు విశ్వాసాన్ని పెంచడంలో తోడ్పడతాయి.

ఊపిరితిత్తులని క్లియర్ చేయడం మాత్రమే కాకుండా ఉబ్బసం ఉన్నవారిలో శ్వాస సమస్యను క్లియర్ చేయడంలో తులసి ఆకులు మేలు చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేయడంలో తులసి ఆకులు మంచివి. తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడటంతో పాటు జలుబు, దగ్గు వంటి ఎన్నో సమస్యలకు తులసి ఆకులు సులువుగా చెక్ పెడతాయి.