RGV: కోర్టులో రామ్ గోపాల్ వర్మకు చుక్కెదరు… షాకింగ్ తీర్పు ఇచ్చిన హైకోర్టు?

RGV: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతల గురించి గతంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన సంచలనమైన పోస్టులను దృష్టిలో పెట్టుకొని ఈయన పై పోలీస్ కేసు నమోదు అయిన సంగతి మనకు తెలిసినదే. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఈయనపై కేసు నమోదు కావడంతో పోలీసులు స్వయంగా హైదరాబాద్లోనే వర్మ ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు.

ఈనెల 19వ తేదీ వర్మ పోలీస్ విచారణకు హాజరు కావాలని తెలియజేశారు. అయితే ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలి అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలా ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ఈయనకు షాకింగ్ తీర్పు ఇచ్చింది. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలి అనే విజ్ఞప్తిని కోర్టు తోసి పుచ్చింది.

అరెస్టు విషయంలో మీకు ఏదైనా ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి అంటూ కోర్టు తెలియజేసింది. ఇలా కేసు కొట్టేయాలని పిటీషన్ మాత్రమే కాకుండా పోలీస్ విచారణకు కూడా తనకు మరింత సమయం కావాలని వర్మ కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయంపై కూడా కోర్టు విచారణ జరిపి, ఈ విషయంపై పోలీసులనే అడగాలి అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది దీంతో వర్మకు ఊహించిన షాక్ తగిలిందని చెప్పాలి.

ఈయన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు అయితే ఈయన చేసిన పోస్ట్ పట్ల కూటమి నేతలు కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఈయనపై కేసును నమోదు చేశారు. ఇక ఈ విషయంలో వర్మ తప్పనిసరిగా అరెస్టు అవుతారని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వర్మ తన కేసును కొట్టివేయాలి అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ విషయంలో కోర్టు నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది.