తగ్గిన శారీరక శ్రమతో ఇలాంటి ఆరోగ్య సమస్యలా.. ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిందే!

ఆధునిక జీవన విధానం, కదలికలేని ఉద్యోగాలు, ఫాస్ట్‌ఫుడ్‌ వల్ల మధుమేహం బారిన పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడుతుండగా సరైన వ్యాయమం లేకపోవడం, ఎక్కువ సమయంలో ఒకే స్థానంలో ఉండటం వల్ల మధుమేహం బారిన పడే అవకాశాలు ఉంటాయి. ధూమపానం, మద్యపానం వల్ల చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు.

డయాబెటిస్ బారిన పడిన వాళ్లలో చాలామంది కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నారు. కదలికలేని శరీరంలో ఇన్సులెన్స్‌ రెసిటెన్సీ పెరిగే ఛాన్స్ ఉండటం వల్ల ఎక్కువమంది మధుమేహం బారిన పడుతున్నారు. కదలికలేని శరీరంలో ఇన్సులెన్స్‌ రెసిటెన్సీ, అలసట, విపరీతంగా దాహం వేయడం, తరచూ నీరసంగా ఉండటం, ఎక్కువ బరువులు మోయలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

షుగర్ బారిన పడిన వాళ్లలో చాలామందిలో కిడ్నీ, కళ్లు, గుండె, రక్తనాళాలు, కాళ్లు, చేతులకు సంబంధించిన సమస్యలు వస్తాయి. డబుల్‌ ప్రాసెస్‌ బియ్యంతో చేసిన అన్నం తినడం వల్ల ఎక్కువమంది త్వరగా మధుమేహం బారిన పడుతున్నారు. చపాతీకి బదులు జొన్నరొట్టె తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. బ్రౌన్ రైస్ ను ఆహారంలో భాగం చేసుకోవాలి. పొట్టుతో ఉన్న పప్పులు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.

డయాబెటిక్‌ వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఏడుగురిలో ఒకరు పుట్టుక సమయంలో డయాబెటిస్ బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. డయాబెటిస్ వల్ల దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.