Kangana Ranaut: హమ్మయ్యా.. మొత్తానికి కంగనా రనౌత్ కీ ఊరట లభించిందిగా?

Kangana Ranaut: బాలీవుడ్ బ్యూటీ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్‌ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఒకవైపు కాంట్రవర్సీలలో నిలుస్తూనే మరొకవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలదిస్తూ ఉంటుంది కంగనా. ఇకపోతే కంగనా రనౌత్‌ నటిస్తున్న సినిమాలలో ఎమర్జెన్సీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా విడుదల తేదీ పై తాజాగా మరో అధికారిక ప్రకటన విడుదల అయ్యింది.

ఈ ఎమర్జెన్సీ సినిమాలో ఆమె లీడ్ రోల్ లో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం చాలా ఇబ్బందులు పడుతోంది. ఈ చిత్రం గతేడాది లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్‌ చిక్కుల వల్ల పలు ఇబ్బందులు రావడంతో రిలీజ్‌ విషయంలో పలుమార్లు వాయిదా పడుతూనే వచ్చింది. అయితే ఎట్టకేలకు ఎమర్జెన్సీ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 17న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే ఏడాది విడుదల కానుంది. నిజంగా ఇది కంగనాకీ భారీగా ఊరట లభించే విషయం అని చెప్పాలి.

ఈ మేరకు ఒక పోస్టర్‌ ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో తమ వర్గాన్ని తక్కువ చేసి చూపించారని కొందరు సిక్కులు మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించడంతో విడుదల విషయంలో చిక్కులు వచ్చాయి. వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఎఫ్‌సీని మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశించడంతో మరోసారి ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు కోర్టు నుంచి కూడా అడ్డంకులు లేకపోవడంతో 2025 జనవరి 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాను 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఘటనల ఆధారంగా రూపొందింది.