Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ట్రైలర్ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ తో ఈ సినిమాపై ఉన్న అంచనాలు కాస్త మరింత పెరిగాయి. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ లో తెలుగు ట్రైలర్ మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతుంది. నిన్న బీహార్ లోని పాట్నాలో ఈ ట్రైలర్ ను గ్రాండ్ గా విడుదల చేశారు.
కాగా ఈ ఈవెంట్ లో నేషనల్ క్రష్ రష్మిక, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు సందడి చేసిన విషయం తెలిసిందే. ట్రైలర్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుండే పాస్ ల కోసం తెగ కొట్టుకొని పాస్ లను దక్కించుకున్నారు. అయితే ఇప్పటికే ట్రైలర్ విడుదల అయిన తర్వాత మిలియన్ల కొద్ది వ్యూస్ ని సాధించి రికార్డును సాధించిన ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. అదేంటంటే పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లైవ్ ను అత్యధిక వ్యూవర్స్ చూసినట్టు పుష్ప టీమ్ అధికారికంగా ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమా ఈవెంట్ లైవ్ ని ఇంత మంది జనాలు చూసింది లేదు.
పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ లైవ్ ను దాదాపుగా 2.6 లక్షల మంది చూసారట. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఈవెంట్ లైవ్ ను ఇంత భారీ మొత్తంలో చూసింది లేదు. కానీ పుష్ప 2 ఈ ఘనత కూడా సాధించింది. అలా కేవలం ట్రైలర్ తో మాత్రమే కాకుండా ట్రైలర్ ఈవెంట్ తో కూడా సరికొత్త రికార్డును సృష్టించాడు బన్నీ. ఇందుకు సంబంధించిన విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఆ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో అల్లు అర్జున్ అభిమానులు పుష్ప రాజ్ అంటే అట్లుంటది. ఈసారి కూడా తగ్గేదేలే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.