YSRCP: వైసీపీ ఎమ్మెల్యేలను గురించి పట్టించుకోవటం అవసరం లేదు: కరణం భాస్కర్

YSRCP: 11 నియోజకవర్గ ప్రజలలో గెలిచిన YCP, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల గురించి పట్టించుకోకపోవడం మంచిది . ఎందుకంటే వారు జగన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) బందీలు ఉన్నారు, ప్రజల సమస్యలు పట్టించుకునే వారు కాదని రుజువైపోయింది. అలాంటి పరిస్థితులలో అటువంటివారిని ప్రజలే మరిచిపోతారు తగిన విధంగా గుణపాఠం చెబుతారు ఇక పాలక పార్టీలకు అవసరమేముంది అని కరణం భాస్కర్ గారు , రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు పలు ప్రశ్నలు వేసారు.

అధికార పక్షం లో ప్రతిపక్షం కూడా ఎలా ఉంటుందో ప్రజలకు చూసే అవకాశం వస్తుంది. నిజమైన ప్రజాస్వామ్యంలోనిజాయితీగా పాలనకు అలవాటు పడతారు. ఉప ముఖ్యమంత్రి గారు పాలనలోని లోపాలను బహిరంగ గానే ఎత్తి చూపలేదా! ప్రజలకు అసెంబ్లీ కొత్తరకంగా ఉంటుంది. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని, పద్ధతిని కాలదన్ని ప్రతిపక్షం లో ఏ పార్టీ లేదుకదా మాకే ఇవ్వవచ్చు కదా అంటున్నారు .తెలివి గలిగిన వారెవరు కొరివితో తల గోక్కోరు. అంత రాజకీయ అవసరం లేదు. రాజకీయం పట్ల మార్యద, గౌరవం ఎంత మాత్రం అనేది ప్రజలందరికి తెలుసు.

ycp కి ప్రతిపక్ష నాయకుడి హోదా లేనంత మాత్రాన మీరు మాట్లాడుతున్న మాటలలో, మీ భాషలో, సబ్జెక్ట్ లో పస, సత్తా ఉందంటే, సరైనా సలహాలు, అభివృద్ధికి సహయ పడతారనుకుంటే స్పీకర్ గారు మీకిచ్చిన రెండు నిమిషాలు 20 నిమిషాలు కావచ్చు రెండు గంటలు కావచ్చు.

అయితే అసెంబ్లీ ఉప సభాపతి స్థానంలో శ్రీ రఘు రామకృష్ణ రాజు (Raghurama Krishnam Raju) గారు ఉన్నారు. జగన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు వారిని అధికారం చేత పోలీస్ తో మీరు పెట్టించిన హింస,నరకం,మీరు- ఆయన మర్చిపోయి వుండరు. ఆయన ఆంధ్రప్రదేశ్ కు రావాలంటేనే భయపడ్డ పరిస్థితి కల్పించిన మీకు ఇలాంటి పరిస్థితి.

తల రాత ఇంకా ఎన్నెన్నిటిని చూడవలసి వస్తుందో! అలాంటి ఆర్ ఆర్ ఆర్ (Raghurama Krishnam Raju) నాయకుడిముందు మీరు గౌరవించి, నమస్కరించి అసెంబ్లీలో కూర్చోవాలి. మీ ప్రతి కదలిక వారి కనుసన్నలలోనే.అపుడు మీ పరిస్థితి ఎలావుంటుందో ప్రజలు తిలకించవచ్చు. ఇది జగన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గారి నిశ్చలాత్వానికి, నిబద్దతకు, సమయస్ఫూర్తికి ఒక పరీక్షే అని కరణం భాస్కర్ గారు , రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు అన్నారు

Cine Critic Dasari Vignan Comments On The Awards Received By Balakirshna | Telugu Rajyam